/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/solar-plant-jpg.webp)
solar plant
Telangana: తెలంగాణ రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి వేగంగా అడుగులు పడుతున్నాయి. మహిళా పొదుపు సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించడంతో కల్పించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది. ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళ సంఘాలతో కలిసి జిల్లాకు రెండేసి మెగావాట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాలో 64 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి ఈ సోలార్ విద్యుత్ ప్లాట్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.
Also Read: USA: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా
32 రెండు జిల్లాలో 64 మెగావాట్ల
అయితే మంగళవారం గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, ఆర్ధికశాఖ అధికారులు ఈ విషయంపై సమావేశమై చర్చలు జరిపారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలు, నిధుల నిర్వహణ తదితర అంశాల గురించి చర్చించారు. అయితే ముందుగా వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ రుణాలకు సంబంధించి బ్యాంకర్లతో చర్చలు, ఒప్పందాలు ఆలస్యం జరుగుతుండడంతో.. జిల్లాలో ఒక మహిళా సంఘానికి ఒక మెగావాట్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 32 రెండు జిల్లాలో 64 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు అధికారులు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 4,36,512 మహిళా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 46,66,523 మంది సభ్యులు ఉన్నారు.
రూ. 192 కోట్లు ఖర్చు
ఒక మెగా వాట్ విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్లాంట్ ను పెట్టడానికి సుమారు 4 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. అలాగే రూ. 3కోట్లు ఖర్చు అవుతుంది. ఇలా ఒక్క మెగావాట్ కి 3 కోట్లు కాగా, 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 192 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో రూ. 30 కోట్లు మహిళా సంఘాల నుంచి ఇన్వెస్ట్ చేయగా.. మిగిలిన ఇన్వెస్ట్మెంట్ శ్రీనిధి మహిళా సమాఖ్య ద్వారా ప్రభుత్వం సమకూర్చనుంది. ఈ ప్రాజెక్ట్ కార్యాచరణకు సంబంధించిన ఆర్డర్లు ఒకటి రెండు రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది.
Also Read: Nora Fatehi: కార్చిచ్చులో ఇరుక్కుపోయిన నటి.. వీడియో వైరల్.. అమెరికాలో ఏం జరుగుతోంది?