/rtv/media/media_files/2025/08/17/telangana-abortions-2025-08-17-09-17-37.jpg)
గత ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో అబార్షన్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో ఏపీతో పోలిస్తే తెలంగాణలో దాదాపుగా 3 రెట్లు అధికంగా పెరిగాయి. గత ఐదేళ్లలో ఏపీలో 367 శాతం పెరగగా.. తెలంగాణలో 917 శాతం పెరిగాయి. ఈ గణాంకాలను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చల సందర్భంగా కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ రాజ్యసభలో వెల్లడించారు. తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 16,059 అబార్షన్లు నమోదయ్యాయి. 2020-2లో 1578 అబార్షన్లు జరిగాయి. ఇక అదే సమయంలో ఏపీలో గత ఐదు సంవత్సరాలలో గర్భస్రావాలు 4 రెట్లు పెరిగాయి. 2020-21లో 2,282 నుండి 2024-25లో 10,676కి పెరిగాయి. కాగా 25 వేల 884 అబార్షన్లతో కేరళ టాప్ లో ఉంది. ఆ తరువాత మహారాష్ట్ర (207019), తమిళనాడు (101414), అస్సాం (76642), కర్ణాటక (70241), రాజస్థాన్ (53714) ఉన్నాయి. 20 అబార్షన్లతో లక్షద్వీప్ చివరి స్థానంలో ఉంది.
What a wonderful scheme for women in Telangana, now cruelly stopped by this useless Congress government, KCR Kits not only supported mothers and newborns but also kept abortions low, with numbers now shooting up from 1,578 in FY21 to 16,059 in FY25 after they scrapped it.… pic.twitter.com/BgwCqWHepP
— Bala kumar Ugadi (@BalaUgadi) August 14, 2025
గంటకు సగటున రెండు అబార్షన్లు
చాలా మంది దంపతులు సంతానం వద్దని అనుకోవడమే ఈ అబార్షన్లకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా సిటీల్లో సెటిలైన జంటల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పిల్లలు వద్దని అనుకున్నవారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కూడా అబార్షన్లు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటుగా పౌష్టికాహార లోపం కూడా పెరుగుతున్న అబార్షన్లకు కారణమని సమాచారం. MTP 2021 సవరణ చట్టం ప్రకారం, గర్భాన్ని రద్దు చేసుకోవడానికి గల గడువును 20 వారాల నుండి 24 వారాలకు పెంచారు. ఇది అబార్షన్లను చట్టబద్ధంగా చేయించుకోవడానికి ఎక్కువ అవకాశాలు కల్పించింది. రాష్ట్రంలో ప్రతీ గంటకు సగటున రెండు అబార్షన్లు జరుగుతున్నట్లుగా సమాచారం.
12 వారాలు పూర్తి కాకముందే
తెలంగాణలో భారీగా గర్భస్రావాలు పెరగడానికి గల కారణాలపై రాష్ట్ర మాతా శిశు ఆరోగ్య విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వి.కె. సుమిత్ర మాట్లాడుతూ.. చాలా అబార్షన్లు 12 వారాలు పూర్తి కాకముందే జరిగాయని.. పిండం అభివృద్ధి చెందే సమయంలో జన్యుపరమైన, క్రోమోజోములు, పుట్టుకతో వచ్చే అసాధారణ లక్షణాలు వంటి వైద్య సమస్యల వల్ల గర్భస్రావాలు జరుగుతాయని అన్నారు. కరోనా మహమ్మారి తర్వాత మహిళలు అధిక సంఖ్యలో ఉద్యోగాల్లో చేరడం.. కెరీర్ ప్లాన్ చేసుకోవడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు కారణంగా కూడా అబార్షన్ల సంఖ్య పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు.