Telangana: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారి అకౌంట్‌లోకి రూ.2 లక్షలు

తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రిటైర్ అయ్యే అంగన్‌వాడీ ఉద్యోగులకు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ విషయంపై రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది.

New Update
telangana anganwadi (1)

telangana anganwadi

తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. పదవీ విరమణ అయ్యే వారికి నగదు ఇవ్వనుంది. ఇకపై రిటైర్ అయ్యే అంగన్‌వాడీ ఉద్యోగులకు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక శాఖ కూడా ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో త్వరలోనే అధికారిక ఉత్తర్వులు విడుదల కానుంది. అయితే జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు