Revanth-KCR: కేసీఆర్ కు బిగ్ షాక్.. ఆ 15 మంది ఎమ్మెల్యేలు జంప్? బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు అధికార హస్తం పార్టీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే 15 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారంటూ ఇటీవల టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. By Nikhil 24 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ చేరికలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ త్వరలోనే 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారంటూ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో మరోసారి చేరికలపై జోరుగా చర్చ సాగుతోంది. కేసీఆర్, కేటీఆర్ పక్కన ఉండే ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. దీంతో పార్టీ మారే బీఆర్ఎస్ MLAలు ఎవరనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. నిజంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారా? లేక హస్తం పార్టీ వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ ఆడుతోందా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. ఇది కూడా చదవండి: BIG BREAKING: కొడంగల్‌లో ఫార్మా కంపెనీ రద్దు.. సీఎం రేవంత్ సంచలనం! ఇటీవల ఆగిన చేరికలు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు 64 సీట్లు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 60 సీట్లు. దీంతో ఉండాల్సిన సంఖ్య కన్నా కేవలం 4 సీట్లు మాత్రమే ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ చేరికలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ప్రారంభించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది. ఈ పరిణామంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఊపుతో తెలంగాణలో ఇక దుమ్మరేపుతాం.. బండి సంచలన కామెంట్స్! అయితే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను సింగిల్ బెంచ్ జడ్జి ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసిది. సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. అయితే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే కారణంతో ఎమ్మెల్యేలు చేరకుండా ఆగారని.. ఇప్పుడు చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. #revanth-reddy #kcr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి