Telangana: పండగ సీజన్ వచ్చేసింది.. క్రిస్మస్, సంక్రాంతి రెండు పండగలు వెనువెంటనే వస్తున్నాయి. ఇక ఈ సమయంలో పట్టణాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆఫీసులకు, స్కూల్ లకు సెలవులు పెట్టేసి.. పిల్లలతో కలిసి సొంతూళ్ల బాట పడతారు. వారం రోజుల పాటు ఇళ్లకు తాళాలు వేసి సంతోషంగా.. సొంతూరులో అమ్మ చేసిన గారెలు, పిండి వంటలు తింటూ చిల్ అవుతారు. మీరు బాగానే ఎంజాయ్ చేస్తారు సరే.. మరి ఇక్కడ తాళం వేసిన మీ ఇంటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? తాళం వేసిన ఇంటికి ఏమవుతుంది..! అని లైట్ తీసుకోవద్దు. అదే మీ కొంప ముంచుతుంది. ఈ మధ్య తాళం వేసిన ఇళ్ళే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు దొంగలు. దొరికిందే సందని ఇంటిని గుల్ల చేస్తున్నారు. పక్కాగా రెక్కీ చేసి.. రాత్రికి రాత్రి ఇంటిని దోచేస్తున్నారు. తీరిగ్గా ఇంటికి వచ్చాక కానీ తెలియదు మీ ఇళ్ళు మొత్తం దోచేశారని. అయితే పండగ సమయాల్లో ఇలాంటి గజ దొంగలు నుంచి తాళం వేసిన మీ ఇంటి కాపాడుకోవడానికి తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఊరు వెళ్లేముందు.. ఈ 7 జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇది కూడా చూడండి: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు పోలీసుల 7 జాగ్రత్తలు.. ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు కనపడే విధంగా గేటుకు, మెయిన్ డోర్ కి తాళం వేయకూడదు. మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి.. పక్క డోర్లకు తాళం వేయడం మంచిది. దీని వల్ల ఇంట్లో మనుషులు ఉన్నారని అనుకుంటారు. ఇంటికి, ఇంటి గేటుకు తాళం వేసి ఎప్పుడూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళవద్దు. ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. మీ ఇంటి దగ్గర తెలిసిన బంధువులు, స్నేహితులు పడుకునేలా ఏర్పాట్లు చేయండి. ఊరు వెళ్లేముందు ఇంట్లో బంగారు, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను బీరువాలో అస్సలు పెట్టకూడదు. బ్యాక్ లాకర్లలో దాచుకోవడం మంచిది. ఊరు వెళితే ఇంటి పక్కనవారికి, సంబంధిత పోలీసులకు సమాచారం అందించడం మంచిది. పోలీసులకు చెప్పడం ద్వారా రాత్రి సమయాల్లో గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు ఇంటి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. నైట్ టైం ఏదైనా ఒక రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉండేలా ఆన్ చేసి ఉంచాలి. అనుమానిత లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరగడం కనిపిస్తే వెంటనే 100 కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేలా.. ఇంటికి సీసీ కెమెరా అమర్చుకోవాలి. ఇంటి బయట నాలుగు దిక్కులు కవర్ అయ్యేలా కెమెరాలు పెట్టాలి. ప్రతి ఒక్కరు ఈ సూచనలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా