లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో డీఎస్పీపై బదిలీ వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నవంబర్ 11న ఫార్మా కంపెనీల ఏర్పాటు సంబంధించి భూసేకరణకు లగచర్ల సమీపంలో కలెక్టర్, ఇతర అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే.. ఈ సంరద్భంగా కొందరు రైతులు గ్రామంలోకి వచ్చి ప్రజలతో చర్చలు జరపాలని కలెక్టర్ ను కోరారు. దీంతో గ్రామంలోకి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై ఒక్కసారిగా కొందరు దాడులకు దిగారు. వారి వాహనాలను పెద్ద పెద్ద బండరాళ్లతో ధ్వంసం చేశారు.
Also Read: లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్.. గిరిజనులను వేధిస్తే సహించేది లేదంటూ వార్నింగ్
Also Read : బిగ్ బాస్ బ్యూటీ కిర్రాక్ సీత కిర్రాక్ లుక్స్.. కుర్రాళ్ళు ఫిదా!
పోలీస్ వర్గాలపై సర్కార్ సీరియస్..
దీంతో రేవంత్ సర్కార్ ఈ ఘటనపై సీరియస్ అయ్యింది. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు అనేక మంది రైతులను అరెస్ట్ చేసింది. అయితే.. నిఘా వర్గాలతో పాటు స్థానిక పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరగడానికి వారం ముందు నుంచే గ్రామంలో కొందరు సమావేశాలు నిర్వహించి రెచ్చగొట్టినట్లు విచారణలో తేలింది. ఇంత జరుగుతున్నా.. స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు పరిస్థితిని అంచనా వేయకపోవడంపై సర్కార్ సీరియస్ అయ్యింది.
Also Read : రేవంత్ సర్కార్‌పై టాప్ సింగర్ సంచలన వ్యాఖ్యలు
దీంతో భారీగా పోలీస్ అధికారులపై చర్యలు ఉంటాయన్న ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. ఏకంగా రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీపై సైతం చర్యలు ఉండే అవకాశం ఉందన్న చర్చ కూడా జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పరిగి డీఎస్పీపై వేటు వేసింది సర్కార్. పరిస్థితులు కాస్త చక్క బడిన తర్వాత మరికొందరు అధికారులపై సైతం చర్యలు ఉండే అవకాశం ఉందన్న ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది.
Also Read : KIM: దక్షిణ కొరియాకు నరకం చూపిస్తున్న కిమ్