KIM: దక్షిణ కొరియాకు నరకం చూపిస్తున్న కిమ్

దక్షిణ కొరియా, ఉత్తర కొరియల మధ్య శత్రుత్వం అందరికీ తెలిసిందే. ఇది అడ్డం పెట్టుకుని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియాను వేధిస్తుంటారు. తాజాగా సరిహద్దుల్లో మెటాలిక్ గ్రైండింగ్ శబ్దాలను వినిపిస్తూ నరకం చూపిస్తున్నాడు.

New Update
kim

North Korea: 

 కిమ్ వింత చేష్టలు భరించలేక దక్షిణ కొరియా అధికారులు, ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. గతంలో తన  చెత్త బెలూన్లతో పక్క దేశంలో ఇళ్లు, ఎయిర్‌పోర్టులు, రోడ్లపై రాకపోకలకు అంతరాయం సృష్టించాడు. ఇప్పుడు మరో విచిత్ర ఆలోచనతో దక్షిణ కొరియాతో వేధిస్తున్నాడు. సరిహద్దులో మెటాలిక్ గ్రైండింగ్‌ చేస్తూ.. ఆ శబ్దాలను అక్కడి ప్రజలకు లౌడ్‌ స్పీకర్లను ఏర్పాటు చేసి మరీ వినిపిస్తూ నరకం చూపిస్తున్నాడు. 

దక్షిణ కొరియా సరిహద్దు గ్రామం డాంగ్సన్. ఈ గ్రామాంపై తన ప్రతాపం చూపిస్తున్నాడు కిమ్. ఈ గ్రామంలో భరించలేని శబ్దం వచ్చే బాంబులను పేల్చడం, మెటాలిక్ గ్రైండింగ్, ఫిరంగి కాల్పులు లాంటి శబ్దాలతో లౌడ్ స్పీకర్‌‌లను ఏర్పాటు చేశాడు. దీంతో 24 గంటలు సౌండ్స్ చేస్తూ గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నాడు. దీనికి గ్రామంలో చిన్న పిల్లలు, వృద్ధులు నిదురపోలేక సతమతమవుతున్నారు. దీంతో ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉత్తర కొరియా తమను పావులుగా వాడుకుంటోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని భరించలేక ఇంటి తలుపులు, కిటికీలను స్టైరోఫోమ్‌తో మూసివేస్తున్నామని, ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ కొరియా అధికారులు. 

ఉభయ కొరియా దేశాలు ప్రతీకార దాడులను ఆపేసి.. తమ పాత ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని దక్షిణ కొరియా ప్రభుత్వం పిలుపునిచ్చింది.  ఇప్పటికే ఉత్తర కొరియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ దక్షిణ కొరియా ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు కలిగించిందని, చెత్త బెలూన్లు ప్రయోగించి అక్కడి విమానాలు, ఓడల సర్వీసులకు అంతరాయం కలిగించిందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇరుదేశాల మధ్య ఉన్న ఘర్షణను మరింత తీవ్రం చేయడానికి కిమ్‌ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. 

Also Read: MH: మహారాష్ట్రలో పవన్ ప్రచారం..తెలుగు, హిందీ, మహారాష్ట్రల్లో ప్రసంగం

Advertisment
Advertisment
తాజా కథనాలు