/rtv/media/media_files/2025/09/02/shivadar-reddy-2025-09-02-13-12-37.jpg)
ఈ నెలాఖరున డీజీపీ జితేందర్ రిటైర్ మెంట్ ఉండటంతో కొత్త డీజీపీ ఎవరనే ఆసక్తి పోలీసు శాఖలో నెలకొంది. మరోవైపు ఇతర కీలక విభాగాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కూడా సర్కార్ గట్టిగానే ఫోకస్ పెట్టింది. కీలక బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై రేవంత్ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కొత్త డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్ రెడ్డిని దాదాపుగా నియమించే అవకాశం ఉంది.ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డీజీ సీవీ ఆనంద్‌ను ఏసీబీ డీజీగా బదిలీ చేసి, ఆయన స్థానంలో అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) మహేశ్ భగవత్ పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.
రవిగుప్తాను విజిలెన్స్‌కు
అటు హోం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిగుప్తాను విజిలెన్స్‌కు, జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రాను హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, ఐజీ (పీ అండ్ ఎల్) ఎం.రమేష్ తో పాటుగా మరికొందరు ముఖ్య అధికారులు, మూడు కమిషనరేట్ల పరిధిలో డీసీపీలు, పలువురు జిల్లా ఎస్పీలు, కమిషనర్లు బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా సీఎస్ రామకృష్ణారావును పదవీ విరమణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతితో గడువు పెంచి కొనసాగిస్తున్నట్లేగానే డీజీపీ జితేందర్‌ను కూడా కొనసాగించే అవకాశం లేకపోలేదని మరికొందరు చర్చించుకుంటున్నారు.