BIG BREAKING: బీఆర్ఎస్ నేత దారుణ హత్య

సంగారెడ్డి జిల్లాలో రాజకీయ హత్య సంచలనంగా మారింది. కల్హేర్ మండలం కొత్తచెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ నేత హరిసింగ్‌ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను నరికి చంపారు. ఈ హత్యకు రాజకీయ కక్షలే కారణమని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు.

New Update

సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్య కలకలం రేపుతోంది. కల్హేర్ మండలం కొత్తచెరువు తండాకు చెందిన హరిసింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. హరిసింగ్ బీఆర్ఎస్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యకు రాజకీయ కక్షలే కారణమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పుటి నుంచే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

(telugu-news | latest-telugu-news | murder)

Advertisment
తాజా కథనాలు