BREAKING: నాకు మంత్రి పదవి వద్దే వద్దు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తనకు మంత్రి పదవి వద్దే వద్దని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో LC నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ చేశారన్నారు. కానీ తనకు మునుగోడు ప్రజలే ముఖ్యమని అందుకే అక్కడి నుంచి పోటీ చేశానన్నారు.

New Update
Komatireddy Raj Gopal reddy Vs Revanth Reddy

మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి వద్దే వద్దని.. మునుగోడు ప్రజల అభివృద్ధే ముఖ్యమన్నారు. గతంలో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ తనకు మునుగోడు ప్రజలే ముఖ్యమన్నారు. అందుకే అక్కడి నుంచి పోటీ చేయలేదన్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులంతా ఓడిపోయారన్నారు. కానీ తాను మాత్రమే గెలిచానన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనను ఓడించింది బీఆర్ఎస్ కాదన్నారు. కమ్యూనిస్టులే తనను ఓడించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడంతోనే తాను ఓడిపోయానని చెప్పుకొచ్చారు. 

#telugu-news #Revanth Reddy #latest-telugu-news #mla komatireddy rajgopal reddy
Advertisment
తాజా కథనాలు