సియోల్‌లో తెలంగాణ మంత్రుల టీమ్ పర్యటన.. మూసీ ఎలా మారనుందంటే ?

మూసీ నది ప్రక్షాళన దిశగా రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. తెలంగాణ మంత్రులు, అధికారులు దక్షిణ కొరియా రాజధానీ సియోల్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ నదుల పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు తెలుసుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

river
New Update

హైదరాబాద్‌లో మూసీ నదిని ప్రక్షాళన చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ మంత్రులు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. ఆ దేశ రాజధానీ నగరమైన సియోల్‌లో ప్రస్తుతం మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. అక్కడ ప్రవహిస్తున్న హాన్, చియోంగ్‌చియాన్‌ నదులను పరిశీలిస్తున్నారు. ఈ నదుల పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, అనుసరించిన విధానాలను తెలుసుకుంటున్నారు. అదే పద్ధతిలో తెలంగాణలో కూడా మూసీ నదిని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు.  

దక్షిణ కొరియాలోని ఉత్తరం వైపు ఉన్న తెబెక్‌ సన్‌మేక్ పర్వాతాల్లో హాన్ నది పుట్టింది. సియోల్ నగరంలో ఇది సుమారు 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ఆ తర్వాత పశ్చిమాన ఉన్న 'ఎల్లో సీ'లో కలుస్తుది. గతంలో హాన్ నది నీటిని సియోన్ ప్రజలు తాగునీరుగా వాడుతుండేవారు. వలసలు, పరిశ్రమలు పెరగడంతో హాన్‌తో పాటు ఆ నది కూడా కలుషితంగా మారింది. అయితే 2006 నుంచి 2011 మధ్య హన్ నది అభివృద్ధి జరిగింది. ఆ సమయంలో అక్కడ మేయర్‌గా పనిచేసిన ఓ-షే-హూన్ ఆధ్వర్యంలో హాన్‌ నది పునరుజ్జీవం పేరిట ఈ అభివృద్ధిని చేపట్టారు.

Also Read: నాంపల్లి స్పెషల్ కోర్టులో స్టేట్‌మెంట్‌ ఇచ్చిన కేటీఆర్.. ఏమన్నారంటే ?

ఎలా అభివృద్ధి చేశారంటే ? 

మురుగు నీరు నదిలోకి రాకుండా 4 మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వీటిలో శుద్ధి చేసిన సగం నీటిని నదిలోకి , మిగిలిన సగం నీటిని తాగడానికి, ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నారు. నది పొడవున హైవే, చుట్టుపక్కల భారీ అపార్ట్‌మెంట్‌లను నిర్మించారు. అలాగే భారీ సంఖ్యలో కన్వెన్షన్ సెంటర్లు, కాన్ఫరెన్స్ హాళ్లు, భారీ రెస్టారెంట్లు, హోటళ్లు నిర్మించారు. నదికి ఇరువైపులా తేలియాడే రెస్టారెంట్‌లు, రూఫ్‌టాప్‌ గార్డెన్లు, కేఫటేరియాలు, 40కిపైగా షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేశారు. నదిలో బోటింగ్, నదీతీరం వెంబడి సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, పార్క్‌లను కూడా నిర్మించడంతో నిత్యం సందర్శకులు ఆ ప్రాంతాలకు వస్తూనే ఉంటారు. ఏటా సగటున 6.69 కోట్ల మంది పర్యాటకులు సియోల్‌కు వస్తున్నారు. 

Also Read: ఏపీలో మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. రూ.99కే క్వార్టర్ అమ్మకాలు షురూ!

మూసీ పక్కనే ఇళ్లు

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో మూసీ నది పుట్టింది. హైదరాబాద్‌లో ఈ నది దాదాపు 58 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. గతంలో హైదరాబాద్‌ వాసులు మూసీ నది నీళ్లు తాగేవారన్న సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా వలసలు, పరిశ్రమలు పెరగడంతో నది కలుషితమైంది. ఇప్పటికీ చాలా మంది మూసీ నది వెంట దుర్వాసన వస్తుంటోంది. ఇప్పటికీ చాలామంది పేదలు మూసీ నది పక్కనే నివసిస్తున్నారు. మూసీ నది హైదరాబాద్ దాటి కృష్ణా నదిలో కలిసి ఆ తర్వాత బంగాళఖాతంలోకి వెళ్తుంది.

Also Read: APPSC చైర్మన్ ను నియమించిన గవర్నర్.. ఆ ఐపీఎస్ అధికారికి ఛాన్స్!

మూసీ ఎలా మారనుందంటే..

తొలిదశలో మూసీ నది ప్రవాహక ప్రాంతం అభివృద్ధి చేస్తారు. నదికి ఇరువైపుల రిటైనింగ్ వాల్ నిర్మిస్తారు. రెండో దశలో నదికి ఇరువైపుల 50 మీటర్ల పరిధిలో బఫర్‌జోన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. 55 కిలోమీటర్ల మేర రెండు వైపుల విశాలమైన రోడ్లు నిర్మిస్తారు. అలాగే పార్కులు, హోటళ్లు, పర్యాటక కేంద్రాలు, గేమింగ్ డోన్స్‌, సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ ట్రాక్‌లు, సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తారు. అలాగే మూసీపై దాదాపు 50 పైగా వంతెనలు నిర్మిస్తారు. బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. బస్‌స్టాప్, మెట్రోకు అనుసంధానిస్తూ రోడ్లు నిర్మిస్తారు. 

Also Read:  ప్రజలకు చంద్రబాబు సర్కార్ దీపావళి గిఫ్ట్.. కేబినెట్ కీలక నిర్ణయాలు!

#telugu-news #telangana #musi-river #south-korea
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe