ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సులభతర వాణిజ్య విధానాలతో పరిశ్రమలను స్థాపించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని అన్నారు. మలేసియాలో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకలకు ఆయన ఆదివారం హాజరయ్యారు. కౌలాలంపూర్‌లోని అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. స్థానిక తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
Also read: తెలంగాణ వచ్చి పదేళ్లైన వలసలు కొనసాగుతున్నాయి: సీఎం రేవంత్
హైదరాబాద్ ఎంట్రీ పాయింట్
మలేసియా- భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పెట్టుబడులతో వచ్చే వాళ్లందరికీ హైదరాబాద్ ఎంట్రీ పాయింట్‌గా ఆహ్వానం పలుకుతోందని తెలిపారు. వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించేందుకు తాము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: కుల గణన చేసేది అందుకోసమే.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
వాళ్లకి ఎప్పటికీ రుణపడి ఉంటాను
మరోవైపు తాను ప్రజాప్రతినిధిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు అభినందనలు తెలిపిన వాళ్లకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. 2 దశాబ్దాల తన రాజకీయ ప్రస్థానంలో పార్టీలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటానన్నారు. ఇప్పటిదాకా నలుగురు సీఎంల వద్ద మంత్రిగా ప్రజలకు సేవలు అందించానని.. వారు తనపట్ల ఎంతో ఆదరాభిమానాలు కనబర్చారని పేర్కొన్నారు.
Also Read: లెబనాన్‌తో కాల్పుల విరమణ.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం !
Also Read: ధరణి స్కామ్.. రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు స్వాహా!