Seethakka: ఫుడ్ పాయిజన్ ఆ పార్టీ కుట్రే.. మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు తెలంగాణలో వరుసగా స్కూళ్లలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్ర ఎవరు చేశారో త్వరలో బయటపెడతామన్నారు. ఇందులో భాగమైన ఉద్యోగులను తొలగిస్తామన్నారు. By Nikhil 28 Nov 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్రకోణం ఉందని ఆరోపించారు. వీటి వెనుక ఓ రాజకీయ పార్టీ కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కుట్ర ఎవరు చేశారనేది బయటపెడతామన్నారు. కుట్రల్లో భాగమైన అధికారుల ఉద్యోగాలు తీసేస్తామన్నారు. నిర్మల్ లో ఇథనాల్ కంపెనీకి అనుమతిచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్‌పూర్‌కు రావాలని సవాల్ విసిరారు. ఇది కూడా చదవండి: Modi: టార్గెట్ తెలంగాణ.. రంగంలోకి మోదీ.. అక్కడ భారీ మీటింగ్ కు ప్లాన్! రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థులను సొంత బిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇయ్యరాదని ముఖ్యమంత్రి @revanth_anumula… pic.twitter.com/2DCk0kkDnb — Telangana CMO (@TelanganaCMO) November 28, 2024 ఇది కూడా చదవండి: వాళ్లు తిన్నాకే విద్యార్థులు తింటారు: పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సీఎం రేవంత్ సీరియస్.. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. వసతిగృహాల్లో పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆరా తీశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై వేటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలని సూచించారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలని ఆదేశించారు. Also Read : యువతి ప్రాణం తీసిన పల్లీలు.. అసలేమైందంటే? Also Read : భారత్‌కు చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది.. ఏం చేశాడంటే #seethakka #food-poison #government schools మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి