/rtv/media/media_files/2025/10/18/cm-revanth-konda-surekha-2025-10-18-18-23-01.jpg)
గత నాలుగు రోజులుగా తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన పేరు.. కొండా సురేఖ. ఆమె ఓఎస్డీని తొలగించడంతో పాటు అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు నేరుగా సురేఖ ఇంటికి వెళ్లడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో పోలీసులను అడ్డుకున్న సురేఖ కూతురు సుస్మిత.. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీలకు ప్రాధాన్యత అని చెబుతూనే రెడ్లు అణిచివేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంచిరేవులకు సంబంధించిన దేవాలయ శాఖ భూముల ఫైల్ ను మంత్రి హోదాలో సురేఖ ఆమోదిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి తన తమ్ముళ్ల కోసం ఆపాడని ధ్వజమెత్తారు. ఇంకా అనేక సార్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తన తల్లిని అవమానించారంటూ కన్నీరు పెట్టుకున్నారు.
సురేఖ అయితే.. పోలీసులు అరెస్ట్ చేయడానికి గాలిస్తున్న తన ఓఎస్డీని కెమెరాల ముందే తన కారులో కూర్చోబెట్టుకుని వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరు కాలేదు. అయితే.. కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ తో భేటీ అయ్యి తన ఇబ్బందులను వివరించారు. సమస్యను పరిష్కరించే బాధ్యతను వారు తీసుకున్నారని మీడియాకు చెప్పి వెళ్లిపోయారు. అప్పటి నుంచి సురేఖ మళ్లీ మీడియాకు కనిపించలేదు. సురేఖ మిస్సింగ్ అంటూ కూడా సోషల్ పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సురేఖ ఈ రోజు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. నేడు జరిగిన బీసీ బంద్ లో పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో విభేదాలపై మంత్రి కొండా సురేఖ Exclusive Interview#RevanthReddypic.twitter.com/oSqJTAq3lt
— Telugu360 (@Telugu360) October 18, 2025
బీసీలపై రేవంత్ కు చిత్తశుద్ధి
మొన్న బీసీలను రెడ్లు తొక్కేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సురేఖ.. నేడు సీఎం రేవంత్ ను ఆకాశానికి ఎత్తేశారు. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని కొనియాడారు. రేవంత్ బీసీలకు ఫుల్ సపోర్ట్ అని అన్నారు. రెడ్డి అయి ఉండి కూడా బీసీల కోసం కృషి చేస్తున్నారని ప్రశంసలు గుప్పించారు. కులగణన కోసం అసెంబ్లీలో బిల్లు, ఆర్డినెన్స్ ను తమ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. గవర్నర్ ఒక్క సంతకం పెట్టకుండా బీజేపీ కుట్ర చేసిందన్నారు. స్థానిక ఎన్నికలు లేకపోతే గ్రామాల్లో అభివృద్ధికి ఇబ్బంది ఎదురవుతోందన్న ఆలోచనతో జీవో తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వం పూర్తి మెజారిటీతో చేసిన చట్టాన్ని అమలు చేయకుండా బీజేపీ అడ్డుకోవడం ఏంటని ఫైర్ అయ్యారు. బీసీలపై ప్రేమ ఉంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవిని బీసీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.