ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందే.. రఘునందన్ రావు వార్నింగ్!

FTLలో నిర్మించిన ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందేనని ఎంపీ రఘునందన్ స్పష్టం చేశారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎవరైనా చట్టం ముందు సమానమేనన్నారు. ఫాతిమా కాలేజీని కూల్చడానికి హైడ్రా రంగనాథ్‌కు ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు కానీ తాము విడిచిపెట్టమన్నారు.

New Update
Raghunadan Rao

Raghunadan Rao

పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్న ఫాతిమా కాలేజీని కూల్చే ఆలోచన లేదంటూ హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. FTLలో ఉన్న ఏ నిర్మాణమైనా కూల్చాల్సిందేనన్నారు. ఈ క్రమంలో ఫాతిమా కాలేజీని కూడా కూల్చాల్సిందేనన్నారు. ఎంపీలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎవరైనా చట్టం ముందు సమానమేనన్నారు. ఫాతిమా కాలేజీ కూల్చడానికి హైడ్రా రంగనాథ్‌కు ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు కానీ తాము విడిచిపెట్టమన్నారు. ఫాతిమా కాలేజీని కూల్చేదాకా న్యాయస్థానాల్లో పోరాడుతామన్నారు. 

Advertisment
తాజా కథనాలు