Big Breaking: జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?

యావత్తు తెలంగాణ ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి.. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే చాన్స్ ఉన్నట్లు సమాచారం.

elections
New Update

Telangana: ఎప్పుడెప్పుడా అని  తెలంగాణ మొత్తం  ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలున్నాయని సమాచారం. డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి.. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే సూచనలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. పంచాయతీ ఎన్నికలను ఈ సారి మూడు దశల్లో నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 

Also Read: AP: ఆ మూడు పదాలు తొలగింపు.. ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు

జనవరి 21వ తేదీన తొలి దశ, జనవరి 25వ తేదీన రెండో దశ, జనవరి 30వ తేదీన మూడో దశలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ పూర్తయ్యాక ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు నడుస్తున్నట్లు తెలిసింది. 

Also Read: Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!


పోటీకి అర్హతలు ఇవే..

- సర్పంచ్/వార్డుకు పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువమంది సంతానం ఉంటే పోటీకి పనికిరారు

- 1995 జూన్ 1 తర్వాత మూడో సంతానం ఉండరాదు.

- ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే వారు పోటీలో పాల్గొనవచ్చు.

- పోటీకి కనీస వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

- పోటీ చేసే అభ్యర్థి గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి.

- వార్డు మెంబర్/సర్పంచ్‌కు ప్రతిపాదకుడు అదే వార్డు/గ్రామంలో ఓటరు అయి ఉండాలి.

- స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీ చేయరాదు.

  • దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటుచేసిన సంస్థల్లోనివారు పోటీకి అనర్హులు.


- ప్రభుత్వం ద్వారా 25 శాతానికి మించి పెట్టుబడి కలిగిన సంస్థలు/కంపెనీల మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్లు, సెక్రటరీలు పోటీ చేయరాదు.

  • ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధ్రువీకరణను నామినేషన్ల పరిశీలనలోపు ఇస్తే వారు అర్హులే.

 

Also Read: AP: ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు..సర్కార్‌ కీలక నిర్ణయం!

 

Also Read:  Delhi: ఇంకా రాజధానిగా ఢిల్లీ అవసరమా..?

#telangana #panchayat-elections #panchayat election schedule
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe