రంజాన్ బంపర్ ఆఫర్.. 24 గంటలు షాపులు తెరవచ్చు..!

మార్చి 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 24 గంటల పాటు షాపులు తెరుచుకోవచ్చని తెలంగాణ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది గంటలు లేదా వారానికి 48 గంటల కంటే ఎక్కువ పనిచేసే ఉద్యోగులకు రెండింతల వేతనం చెల్లించాలని తెలిపింది.

New Update
Telangana

Telangana Photograph: (Telangana )

రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ కార్మిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ మాసం కారణంగా మార్చి 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 24 గంటల పాటు కూడా షాపులు తెరుచుకోవచ్చని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రోజుకు ఎనిమిది గంటలు లేదా వారానికి 48 గంటల కంటే ఎక్కువ పనిచేసే ఉద్యోగులకు రెండింతల వేతనం చెల్లించాలని తెలిపారు.

ఇది కూడా చూడండి: Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!

మహిళా ఉద్యోగులు రాత్రి వేళలో..

ఉద్యోగులు సెలవు రోజుల్లో పనిచేస్తే ప్రత్యామ్నాయ సెలవు కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళా ఉద్యోగులు కూడా రాత్రి వేళల్లో పని చేసేందుకు జీవో 476ను తప్పనిసరిగా పాటించాలని సంజయ్ కుమార్ తెలిపారు. 

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్‌ గా ముందుకు దూసుకుపోండి!

రంజాన్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా ఆదేశించారు. 24 గంటల పాటు కూడా షాపులు ఓపెన్ చేయాలని అనుకునే వారు దానికి సంబంధించిన అధికారుల నుంచి రశీదులు కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇది కూడా చూడండి: Puri Jagannadh Golimaar Sequel: పదిహేనేళ్ల తర్వాత పూరీ సినిమాకి సీక్వెల్.. ఈసారి కొడితే బ్లాక్ బస్టరే..!

24 గంటలు షాపులు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగానే పర్మిషన్ ఇచ్చినందుకు మహ్మద్ కృతజ్ఞతలు కూడా తెలిపారు. రెండు వారాల ముందుగానే ఉత్తర్వులు జారీ చేయడం ఆనందంగా ఉందన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు