/rtv/media/media_files/2026/02/19/hall-tickets-released-1-2026-02-19-18-10-10.jpg)
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వార్షిక పరీక్షల హాల్ టికెట్లు బోర్డు విడుదల చేసింది. హాల్ టికెట్లు ఈసారి క్యూఆర్ కోడ్‌కు అనుసంధానం చేస్తూ కీలక మార్పులు చేసింది ఇంటర్మీడియేట్ బోర్డు. మార్చి 2026లో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల హాల్ టికెట్లను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
The Telangana Board of Intermediate Education (TGBIE) has released hall tickets for the Intermediate Public Examinations scheduled for March 2026. pic.twitter.com/QyxWFzoO6Z
— Jacob Ross (@JacobBhoompag) February 19, 2026
షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హాల్ టికెట్లు ఇప్పటికే బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదనంగా, విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు డౌన్‌లోడ్ లింక్‌ను SMS ద్వారా కూడా పంపుతున్నారు. అయితే, వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న కాపీపై సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్ల ద్వారా ధ్రువీకరించుకోవాలని బోర్డు సూచించింది.
QR కోడ్‌తో పరీక్షా కేంద్రం గుర్తింపు
ఈసారి లెటెస్ట్ టెక్నాలజీ తీసుకువచ్చి బోర్డు ఒక కీలక మార్పు చేసింది. ప్రతి హాల్ టికెట్‌పై ఒక ప్రత్యేకమైన QR కోడ్‌ను ముద్రించారు. విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ ద్వారా ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పరీక్షా కేంద్రం ఖచ్చితమైన లొకేషన్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల పరీక్ష రోజున కేంద్రం వెతుక్కునే ఇబ్బంది తప్పుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు, పరీక్షలు పారదర్శకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
Follow Us