తెలంగాణలోనే ఉంటాం.. క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్ లు!

డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ తెలంగాణ కేడర్‌కు చెందిన నలుగురు ఐఏఎస్‌ అధికారులు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, సృజన క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు.

author-image
By srinivas
dtrer
New Update

AP-TG News: డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ తెలంగాణ కేడర్‌కు చెందిన నలుగురు ఐఏఎస్‌ అధికారులు సోమవారం కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. తెలంగాణలోనే తాము కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని వినతులు సమర్పించారు. ఈ మేరకు ఆమ్రపాలి (Amrapali), వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, సృజన క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై  కేంద్ర పరిపాలన ట్రైబ్యూనల్ మంగళవారం విచారణ జరపనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి వెళ్లేందుకు విముఖత చూపుతున్న అధికారులు సీఎస్ శాంతికుమారితో అత్యవసరంగా సమావేశమయ్యారు. వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి తాము ఏపీకి వెళ్లబోమంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Khammam: ఖమ్మంలో బరితెగిస్తున్న బురిడీ బాబాలు..తాంత్రిక పూజపేరుతో ఘోరం

రాష్ట్ర విభజనలో సర్దుబాటు..

ఇక రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను కేంద్రం సర్దుబాటు చేసింది. దీంతో కొందరు అధికారులు తమను ఏపీ కేడర్‌కు కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ కేడర్‌గా గుర్తించాలని కోరుతూ సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్‌ను ఆశ్రయించారు. దీంతో అధికారుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న క్యాట్‌.. ఈ తీర్పును డీఓపీటీ తెలంగాణ హైకోర్టు సవాల్‌ చేసింది. అనంతరం 2023 మార్చిలో పిటిషన్‌పై విచారణ చేపట్టింది. అధికారుల అభ్యర్థనను పరిశీలించేందుకు దీపక్ ఖండేకర్ ఏకసభ్య కమిషన్‌ను  2024 మార్చి 21న కేంద్రం ఏర్పాటు చేసింది. 

ఇది కూడా చదవండి: TS: ఐఏఎస్ ఆమ్రపాలికి షాకిచ్చిన కేంద్రం

ఏపీ కేడర్‌కు వెళ్లాల్సిందిగా ఉత్తర్వులు..

ఇందులో భాగంగానే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల అభ్యర్థనలను పరిశీలించిన కమిషన్.. వారి అభ్యర్థలను తిరస్కరించింది. డీఓపీటీ ఏపీ కేడర్‌కు కేటాయించిన ఆలిండియా సర్వీస్ అధికారులను ఏపీ కేడర్‌కు వెళ్లాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు అక్టోబర్ 16లోగా ఏపీలో రిపోర్ట్‌ చేయాలని డీఓపీటీ తెలిపింది. దీంతో డీఓపీటీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ వారంతా క్యాట్‌ని ఆశ్రయించారు.

ఇది కూడా చదవండి: మర్డర్ మిస్టరీ.. థ్రిల్లింగ్ గా కృతి, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్

మొత్తం 11 మంది అధికారులు..

తెలంగాణ కేడర్‌ కావాలన్న 11 మంది ఐఏఎస్‌ల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. ఈ 11 మంది ఐఏఎస్‌లలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలితో పాటు విద్యుత్‌ శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌ కూడా ఉన్నారు. వీరందరూ తమకు తెలంగాణ కేడర్‌ కావాలని కేంద్రంలోని డీవోపీటీ శాఖకు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ఆమ్రపాలి తన యూపీఎస్సీ అప్లికేషన్‌లో పర్మినెంట్ అడ్రస్ విశాఖది ఇచ్చారు. అందువల్ల ఆమెను ఏపీ కేడర్‌‌కు కేటాయించారు. తనను తెలంగాణ స్థానికురాలిగా గుర్తించాలని ఆమె కోరిన్పటికీ...ఆ అభ్యర్ధనను ప్రత్యూష్ సిన్హా కమిటీ గతంలోనే తిరస్కరించింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున కేంద్రం ఇప్పుడు తాజాగా ఏపీకి వెళ్ళాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో ఆమ్రపాలి, తెలంగాణ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 

ఇది కూడా చదవండి: Bishnoi Gang సల్మాన్ ఖాన్‌ను చంపాలనుకోవడానికి అసలు కారణం ఇదే?

#ap #ias-amrapali
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe