/rtv/media/media_files/2025/09/25/telangana-hyderabad-youth-assaulted-another-youth-in-madhapur-oyo-room-2025-09-25-17-58-45.jpg)
telangana hyderabad youth assaulted another youth in madhapur oyo room
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సమాజంలో దారుణాలు పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. రోజుకో కొత్త యాప్స్ దర్శనమిస్తూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏ యాప్స్ ఎవరి ప్రాణాలు తీస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఏ యాప్స్ ఎవరి కొంప ముంచుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అలాంటి ఒక యాప్ తాజాగా హైదరాబాద్‌లోని ఓ యువకుడికి చుక్కలు చూపించింది.
యువకుడిపై మరో యువకుడు రేప్..
హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడు గే డేటింగ్ యాప్‌లో లాగిన్ అయ్యాడు. అతడిని మరో యువకుడు ట్రాప్ చేశాడు. కొంతకాలం మెసేజ్‌లు చేసుకున్నారు. ఒక రోజు ఓయోకి వెళ్లారు. అక్కడ పరిచయం అయిన యువకుడిపై ట్రాప్ చేసిన యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో అతడు ఎలాగోలా తప్పించుకున్నాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. అతడు చెప్పిన ఘటన వివరాలు విని పోలీసులు షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన ఒక యువకుడు గ్రీండర్ గే డేటింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. అతడికి ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అలా ఇద్దరూ కొంతకాలం డేటింగ్ యాప్‌లో చాటింగ్ చేసుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే.. ఆ ఇద్దరిలో ఒకరు డాక్టర్ కావడం గమనార్హం. ఇద్దరూ ఒకరోజు ఉద్దేశపూర్వకంగా మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓయో రూమ్‌ను బుక్ చేసుకున్నారు.
అనంతరం ఇద్దరిలో ఒక యువకుడు డాక్టర్‌పై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ డాక్టర్ నిరాకరించడంతో యువకుడు అతడిపై దాడి చేశాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరం ప్రైవేట్‌గా కలిసిన విషయాన్ని బయటపెడతానని ఆ యువకుడు బెదిరించాడు. దీంతో ఆ డాక్టర్ రూ.5వేలు చెల్లించాడు. ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు డాక్టర్‌ను డబ్బుల కోసం బెదిరించడం మొదలు పెట్టాడు. అలా డాక్టర్‌ను ఫాలో అవుతూ.. ఓ రోజు అతడు పని చేస్తున్న హాస్పిటల్‌కు వెళ్లి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని.. లేకపోతే అందరికీ చెప్పేస్తానని డిమాండ్ చేశాడు. దీంతో ఆ డాక్టర్ నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.