స్కూల్ బస్సు కింద పడి నర్సరీ విద్యార్థి దుర్మరణం

స్కూల్ బస్సు కింద పడి నర్సరీ విద్యార్థి దుర్మరణం చెందిన దారుణ ఘటన సిరిసిల్లలో చోటు చేసుకుంది. మనోజ్ఞ తలపై నుంచి స్కూల్ బస్సు వెళ్లడంతో అక్కడిక్కడే మరణించింది. స్కూల్ మెనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

New Update
nursery

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి నర్సరీ విద్యార్థి మృతి చెందింది. నామాపూర్‌కి చెందిన భూమయ్య, వెంకటవ్వ కూతురు మనోజ్ఞ మహర్షి స్కూల్‌లో నర్సరీ చదువుతుంది. స్కూల్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వల్ల పాఠశాల బస్సు కింద పడి మరణించిదని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. మనోజ్ఞ తలపై నుంచి బస్ టైర్ వెళ్లడంతో అక్కడిక్కడే చనిపోయింది. విద్యార్థి తల్లి ఒక వ్యవసాయ కూలీ, తండ్రి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి వర్క్ చేస్తుంటారు. చిన్నారి చావుతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 

ఇది కూడా చూడండి:  పాపం.. తప్పిన సోనియా లెక్కలు.. టాప్ 5 కాస్త 4th వీక్ లోనే గుడ్ బై..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు