/rtv/media/media_files/2025/04/07/YaRg21VnK0ASud2OdL5a.jpg)
hair fake treatment
ప్రస్తుత సమాజంలో ఎక్కడా చూసిన మోసమే.. అమాయుకుల అవసరాలను క్యా్ష్ చేసుకుని దోచుకుంటున్నారు కొందరు. అలాంటి మోసాలకు హైదరాబాద్ మహానగరం అడ్డాగా మారింది. తాజాగా ఓ సెలూన్ షాప్ ఓనర్ బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ మోసాలకు దిగాడు. ఢిల్లీకి చెందిన వకీల్ అనే ఓ యువకుడు పాతబస్తీ ఫతే దర్వాజా కేంద్రంగా తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామంటూ ప్రచారం చేశాడు.
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం
— RTV (@RTVnewsnetwork) April 7, 2025
ఢిల్లీకి చెందిన బిగ్‌బాస్ పార్టిసిపెంట్‌కి జుట్టు మొలిపించానంటూ ప్రచారం
పాతబస్తీ ఫతే దర్వాజా దగ్గర బిగ్‌బాస్ సెలూన్ ముందు క్యూ కట్టిన వందలాది మంది యువకులు
గుండు గీసి కెమికల్స్ రాసి పంపిన షకీల్ భాయ్.. సైడ్ ఎఫెక్ట్… pic.twitter.com/NsGUCh5JTt
Also read : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో తులం రూ.56 వేలకు?
Also read : Bus conductor : ఏడడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్!
ఢిల్లీకి చెందిన బిగ్‌బాస్ పార్టిసిపెంట్‌కి జట్టు మొలిపించానంటూ నమ్మించాడు. పాతబస్తీలో తన మిత్రుడైన ఒక షాపు ఉందని అక్కడికి తాను ఆదివారం రోజున వస్తున్నానంటూ ప్రచారం చేసుకున్నాడు. అతగాడిని నమ్మి.. బిగ్‌బాస్ అనే అతని లూన్ ముందు వందలాది మంది బట్టతల యువకులు క్యూ కట్టారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయింది. వారి గుండు గీసి కెమికల్స్ రాసి వెంట్రుకలు మొలిపిస్తామంటూ ఇంటికి పంపించాడు వకీల్.
గుండుకు వంద రూపాయలు
ఒక్కొక్క గుండుకు వంద రూపాయలు చొప్పున వసూలు చేశాడు. అంతేకాకుండా వారికి కొన్ని షరతులు కూడా పెట్టాడు. గుండు ఆరిపోకూడదని... గుండు పైన నీళ్లు చల్లుతూ ఉండాలని.. నీళ్లు కిందికి జారకుండా బట్ట కట్టాలని చెప్పాడు. అయితే ఇంటికెళ్లిన బాధితులకు మంట రావడంతో పాటుగా మరికొందరికి రియాక్షన్స్ అయి బొబ్బలు కూడా వచ్చాయి.. దీంతో లబోదిబో అంటూ చాలామంది బాధితులు ఆస్పత్రికి బాట పట్టారు. ఇప్పుడు ఈ గుండు వ్యవహారం పాతబస్తిలో సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read : పెళ్లిలో చెప్పుల గొడవ.. నా కొడకా అంటూ పెళ్లి కొడుకుని ఊతికారేశారు!