Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో ఆరోగ్య మంత్రి ఆకస్మిక తనిఖీలు.. బయటపడ్డ షాకింగ్ నిజాలు

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు డాక్టర్లు విధులకు గైర్హాజరు కావడాన్ని గుర్తించిన మంత్రి సీరియస్ అయ్యారు. వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

New Update
Hyderabad Gandhi Hospital

Hyderabad Gandhi Hospital

గాంధీ ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు ఆకస్మిక పర్యటన చేశారు. నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి, ఓపీలో ఉన్న పేషెంట్లతో మాట్లాడారు. డాక్టర్ల అటెండెన్స్‌ షీట్ తెప్పించుకుని పరిశీలించారు. ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై మంత్రి సీరియస్ అయ్యారు. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయా డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్‌, డీఎంఈను ఆదేశించారు.

IVF సేవలపై అసంతృప్తి..

ఓపీ, ఐపీ, ఎంసీహెచ్, ఐవీఎఫ్,  ఓపీ డయాగ్నస్టిక్ సర్వీసెస్, స్కానింగ్ వార్డులను పరిశీలించారు. ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై మంత్రి తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత డాక్టర్లకు షోకాజ్ ఇవ్వాలని డీఎంఈను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 

Advertisment
తాజా కథనాలు