Telangana : గ్రూప్​-1 అభ్యర్థులకు షాక్.. పరీక్ష మళ్లీ రద్దు అవుతుందా?

తెలంగాణ గ్రూప్-1 పరీక్షలపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. మరో 20 రోజుల్లో మెయిన్స్ పరీక్షలు జరగనుండగా.. పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. దీనిపై సెప్టెంబర్ 30న విచారణ జరగనుంది. 

New Update
GROUP-1: గ్రూప్-1 కు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు

TG Group-1 : తెలంగాణలో మరోసారి గ్రూప్ -1 పై నియామకాలపై వివాదం మొదలైంది. మెయిన్స్​ పరీక్షలకు ఇంకో 20 రోజులు మాత్రమే సమయం ఉండగా.. గ్రూప్ -1 కొత్త నోటిఫికేషన్ చెల్లదంటూ వికారాబాద్, యాదాద్రి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన జి.దామోదర్‌రెడ్డి మరో అయిదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు 2022లో జారీ చేసిన  గ్రూప్‌-1 పోస్టుల నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం కుదరదంటూ పిటిషనర్లు హైకోర్టుకు వివరించారు. అయితే దీనిపై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ శుక్రవారం విచారణ చేపట్టగా.. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది జె.సుధీర్‌ వాదనలు వినిపించారు. 

 కొత్త నోటిఫికేషన్ చెల్లదు..

ఈ మేరకు 2022లో 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వివిధ కారణాలతో పరీక్ష రద్దైంది. అయితే అప్పడు పరీక్ష రాసిన అభ్యర్థులకే ఈ నోటిఫికేషన్‌ను పరిమితం చేయాల్సి ఉంది. 503కు మరో 60 పోస్టులు కలిపి నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదు. ఈ 60 ఖాళీలను విడిగా భర్తీ చేయాలి. అలాగే ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచడమూ సరైనది కాదంటూ వివరించారు పిటిషనర్ తరఫు న్యావాది జొన్నలగడ్డ సుధీర్‌.  

ఎవరికీ నష్టం జరగలేదు..

ఇక సుధీర్ వాదనలపై కోర్టుకు వివరణ ఇచ్చిన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి.. 'టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ. పరీక్షను రద్దుచేసి తాజాగా నోటిఫికేషన్‌ జారీచేసే అధికారం టీజీపీఎస్సీకి ఉంటుంది. మరిన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది అభ్యర్థులకు ప్రయోజనం చేకూరేందుకు ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమే. 2024 ఫిబ్రవరి 19న 563 పోస్టులకు ఇచ్చిన రీ నోటిఫికేషన్‌తో ఎవరికీ నష్టం జరగలేదు. 60 పోస్టులు పెరగడం అభ్యర్థులకు లబ్ధి చేకూర్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా పెరిగారు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన ఎక్కడా జరగలేదు’అని వివరించారు. ఇక ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి:  జగన్కు షాక్.. Janasenaలో చేరిన మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు!

2024 అక్టోబర్​ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఈ వివాదంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కోర్టు తీర్పుపై నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా పేపర్‌ లీకేజీ కారణంగా ఒకసారి, నిబంధనలు సరిగా పాటించలేదని ఇంకోసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు అయింది. ఇక గ్రూప్​-2 పరీక్ష కూడా ఇప్పటికీ నాలుగుసార్లు వాయిదా పడింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు