తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమగ్ర కులగణనపై ఉత్తర్వులు చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఆర్థిక, విద్య, సామాజిక, ఉద్యోగ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్లు సీఎం శాంతి కుమారి ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రణాళిక శాఖకు ఈ సర్వే బాధ్యతను అప్పగించారు. రెండు నెలల్లోగా అంటే 60 రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు.
Also Read: సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం.. ప్రయాణికులు సేఫ్
మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై రేవంత్ సర్కార్ ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను కమిషన్ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. ఉపకులాల వారీగా ఎస్సీ సామాజిక వర్గంలో వెనుకబాటుతనాన్ని కమిషన్ అధ్యయనం చేయనుంది. 60 రోజుల్లో రిపోర్టు సమర్పించాలని కమిషన్‌కు సూచించింది.