Power Plant : సింగరేణి, జెన్‌కో ఆధ్వర్యంలో విద్యుత్‌ పవర్ ప్లాంట్‌

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రామగుండంలో సూపర్ క్రిటికల్ సాంకేతికతో సింగరేణి, జెన్‌కోల భాగస్వామ్యంలో కొత్తగా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటును నిర్మించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ జెన్‌కోకు ఉత్తర్వులు జారీ చేసింది.

author-image
By B Aravind
Ramagundam
New Update

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రామగుండంలో సూపర్ క్రిటికల్ సాంకేతికతో సింగరేణి, జెన్‌కోల భాగస్వామ్యంలో కొత్తగా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటును నిర్మించనుంది. దీనికి సంబంధించి విధి విధానాలను సింగరేణి సంస్థతో కలిసి వారం రోజుల్లోగా రూపొందించాలని రాష్ట్ర ఇంధనశాఖ జెన్‌కోకు ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను నెల లోగా తయారు చేసి సూచించింది. అయితే రామగుండంలో ప్రస్తుతం జెన్‌కోకు 62.5 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటు ఉంది. కానీ దీనికి కాలం చెల్లింది. దీంతో సంస్థ ఉత్పత్తిని నిలిపివేసింది. అక్కడి ఉద్యోగులను ఖాళీగానే ఉంచి జెన్‌కో జీతాలు ఇస్తోంది. 

Also Read: వామ్మో.. రైల్లోనే ప్రత్యక్షమైన పాము.. వీడియో వైరల్

దాని స్థానంలో కొత్త థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటును నిర్మించి తమను అక్కడే కొనసాగించాలని వాళ్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌.. థర్మల్‌ పవర్‌ ప్లాంటును నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌కు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసిందని రాష్ట్ర ఇంధనశాఖ జెన్‌కోకు ఇచ్చిన ఉత్తర్వుల్లో తెలిపింది. 

మరోవైపు జెన్‌కో, సింగరేణి సంయుక్త భాగస్వామ్యంలో కొత్తగా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటును నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర విద్యుత్‌ ఇంజనీర్ల సంఘం వ్యతిరేకిస్తోంది. జెన్‌కోనే సొంతంగా దీన్ని నిర్మించాలని కోరుతోంది. ఈ మేరకు ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇంజనీర్ల సంఘం  తీర్మానం చేసింది. మరీ దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. 

#ramagundam #singareni #ts-genco #narla-tata-rao-thermal-power-station
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe