/rtv/media/media_files/2024/12/13/m6Ip5eik7N0gHuUWHFDq.jpg)
Telangana govt 4 new schemes implementation from 2025 january 26
TG News: ఈ మేరకు ఖమ్మం కలెక్టరేట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డితోపాటు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితీశ్ వి. పాటిల్‌తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ పథకాల అములపై సమీక్ష నిర్వహించారు. ఈ నాలుగు (రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ) పథకాలను అమలు చేసేందుకు రూ.45 వేల కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లు భట్టి తెలిపారు.
వ్యవసాయ కూలీలు పథకాలకు అర్హులే..
ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఇందిరమ్మ ఇండ్లకు రూ.22500 కోట్లు, రైతు భరోసాకు18 వేల కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చు చేస్తున్నాం. ప్రతి పథకాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మార్గదర్శకాలు జారీ చేశాం. రైతు భరోసా ఒక ఎకరాకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తాం. ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఉన్న భూమి లేని వ్యవసాయ కూలీలు 20 రోజులు ఉపాధి హామీ పని చేసినట్లయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాని అర్హులేనని భట్టి చెప్పారు.
ఇది కూడా చదవండి: IPL 2025: మీ భార్యల వల్లే ఇలా తయారయ్యారు.. ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ రూల్స్
గ్రామాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు..
గ్రామ సభలు పెట్టి లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులకు సూచించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు తెలపాలి. జిల్లా ఇంచార్జ్ మంత్రి జాబితా అమోదించిన తర్వాతే పథకాలు అందించాలి. గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈ పథకాలు అందుకున్న రైతుల వివరాలు వెల్లడించాలని ఆదేశించారు. \