Telangana: తెలంగాణలో మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ !

తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకురానుంది. దీనిపై మరోసారి అధ్యయనం చేసి రిపోర్టు పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA)కు సూచించింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

Village
New Update

Village Revenue System: తెలంగాణలో (Telangana) బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గ్రామ రెవెన్యూ అధికారులను (VRO) వివిధ ప్రభుత్వ శాఖాల్లోకి బదిలీ చేసేశారు. అయితే ఈసారి అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం (Revanth Govt) మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించే దిశగా చర్యలు ముమ్మరం చేస్తోంది. దీనిపై అధ్యయనం చేయాలని గతంలోనే భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA)కు సూచలను చేసింది. దీనిపై అధ్యయనం సీసీఎల్‌ఏ ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 

Also read: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి

మొత్తం 25,750 మంది

ఈ నివేదికలో పేర్కొన్న ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గ్రామీణ స్థాయి రెవెన్యూ యంత్రాంగం ఎంపికపై మళ్లీ ఒకసారి రిపోర్టు ఇవ్వాలని ప్రభత్వం తాజాగా సీసీఎల్‌ఏకు సూచించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్, సీసీఎల్‌ఏకు లెటర్ రాశారు. అయితే సీసీఎల్‌ఏ ముందుగా ఇచ్చిన రిపోర్టులో గతంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఆర్‌వో, ప్రతి ఇంటికి ఒక వీఆర్‌ఏ పనిచేసేవారని చెప్పింది. మొత్తంగా వీరు 25,750 మంది ఉండేవారని చెప్పింది.    

Also read: టీడీపీ నేత రాసలీలలు.. రాత్రికి వస్తేనే పింఛన్లు, ఇంటి స్థలాలు

వీళ్లలో వీఆర్‌ఓలు 5,195 మంది ఉండగా.. వీళ్లలో ఎక్కువగా డిగ్రీ, ఇంటర్మీడియట్ అర్హత ఉన్నట్లు తెలిపింది. ఇక వీఆర్‌ఏలు 20,555 మంది ఉండగా.. వీళ్లలో డిగ్రీ అర్హత కలిగి ఉన్నవారు 3680 మంది ఉన్నారని..  ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్లు 2761, పదో తరగతి వరకు చదివిన వారు 10,347 మంది ఉన్నట్లు వివరించింది. ఇకనుంచి గ్రామస్థాయిలో నియమించే రెవెన్యూ సిబ్బందికి జేఆర్‌వో అంటే జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ లేదా గ్రామ రెవెన్యూ కార్యదర్శి అనే పేర్లు పెట్టాలని ప్రతిపాదనలు చేసింది.  

Also read: న్యాయం గుడ్డిది కాదు.. చట్టానికీ కళ్లున్నాయి.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం!

కొత్తగా 5 వేల మందికి ఛాన్స్

తెలంగాణవ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాలకు సిబ్బందిని నియమించాల్సి ఉంది. కాబట్టి వాళ్లని ఎంపిక చేయాల్సిన విధానం, అర్హతలు, వేతనాల చెల్లింపులు వంటి అంశాలను సీసీఎల్ఏ రెండోసారి సేకరించనుంది. దీంతో ఈ నివేదిక ఇప్పుడు కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఎంతమంది సిబ్బందిని తీసుకోవాలి, పాతవారిని తీసుకుంటే ఏ ప్రాతిపదికన తీసుకోవాలి అనేదానిపై రెవెన్యూశాఖ కసరత్తులు చేస్తోంది. గతంలో తొలగించిన వీఆర్‌వో, వీఆర్‌ఏల నుంచి దాదాపు 5 వేల మందిని తీసుకోవాలని.. అలాగే కొత్తగా మరో 5 వేల మందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

గతంలో పనిచేసిన వాళ్లలో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు అర్హతలు ఉన్నవారినే తిరిగి ఎంపిక చేయాలని రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే గ్రామస్థాయిలో పనిచేసే రెవెన్యూ ఉద్యోగులకు వివిధ రకాల ధ్రువపత్రాల జారీ, ప్రభుత్వ భూముల సంరక్షణ బాధ్యతలు, చెరువులు, కుంటలను సంరక్షించడం, భూ సమస్యలపై క్షేత్రస్థాయి విచారణలు చేయడం, సర్వే పనులకు సహాయకులుగా ఉండటం, విపత్తులు వచ్చినప్పుడు సేవలు చేయడం లాంటి విధులకు కేటాయించాలని ముందుగా ఇచ్చిన నివేదికలో సీసీఎల్‌ఏ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 

Also read:సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా!

అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడం, ఎన్నికల విధులు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవడం లాంటి విధులు సైతం నిర్వహించాల్సిన బాధ్యతలను అప్పగించాలని సూచనలు చేసింది. అయితే రాష్ట్రప్రభుత్వం సీసీఎల్‌ఏను రెండోసారి నివేదిక ఇవ్వాలని కోరడంతో మరీ ఈసారి ఎలాంటి మార్పులు చేసి ప్రభుత్వానికి రిపోర్టు చేయనుందనేది కీలకంగా మారింది. 

 

#telugu-news #telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe