/rtv/media/media_files/2025/07/12/tg-new-ration-cards-2025-07-12-17-31-02.jpg)
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి అంటే.. ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు. గత పదేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగకపోవడంతో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వారంతా తమకు రేషన్ కార్డు వస్తుందా? లేదా? అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే.. రేషన్ కార్డు మంజూరైందా? లేదా? అన్నది సింపుల్ గా తెలుసుకోవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ లో ఒక్క క్లిక్ తో ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం లభిస్తుంది. ఇందుకోసం ఈ స్టెప్స్ ను ఫాలో కండి.
Telangana New Ration Card Application Status:
Step-1: గూగుల్ లో epds telangana ration card అని టైప్ చేయండి.
Step-2: FSC Search: FSC Search with aadhaar no | FSC Aplication ... అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step-3: ఆ తర్వాత మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ FSC Search With Adhar No. అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step-4: అనంతరం ఓపెన్ అయిన విండోలో సెలక్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర మీ జిల్లాను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీ సేవా నంబర్, అప్లికేషన్ నంబర్, యూఐడీ నంబర్ లలో ఏదో ఒకటి నమోదు చేయాల్సి ఉంటుంది.
NOTE: యూఐడీ అంటే ఆధార్ నంబర్.. ఈ నంబర్ ద్వారా సులువుగా రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
Step 5: జిల్లా సెలక్ట్ చేసుకున్న తర్వాత, యూఐడీ ఆప్షన్ ను ఎంచుకుని.. ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అనంతరం సెర్చ్ పై క్లిక్ చేయండి.
Step 6: మీ రేషన్ కార్డ్ దరఖాస్తు స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది. Pending at Mandal Revenue Officer లేదా మీ రేషన్ కార్డు అప్లికేషన్ యాక్సెప్ట్/ రిజెక్ట్ అయ్యిందా? ఆ వివరాలు కనిపిస్తాయి. ఒక వేళ రిజెక్ట్ అయితే ఇందుకు గల కారణాలు కూడా స్క్రీన్ పై కనిపిస్తాయి.