కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి కొత్త విధానాన్ని రూపొందించింది. బిల్డ్ నౌ అనే పేరుతో ఆన్ లైన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిసెంబర్ 3 (మంగళవారం) బిల్డ్ నౌ ను ప్రారంభించారు. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు, లే అవుట్లు నిర్మించాలంటే బిల్డ్ నౌలో ఆన్ లైన్ లో పర్మిషన్ తీసుకోవాలి. అత్యాధునిక ప్రజాపాలన దిశగా ఒక విప్లవాత్మక అడుగు బిల్డ్ నౌ అని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.
బిల్డ్ నౌ స్కూట్నీ లేటెస్ట్ టెక్నాలజీతో ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ కొత్త వ్యవస్థ అనేక టెక్నాలజీలను కలిగిఉంది. ప్రజలు పలు డిపార్ట్ మెంట్ల చుట్టూ తిరగకుండా, వివిధ పోర్టల్స్ మారే అవసరం లేకుండా పర్మిషన్ అంతా ఒకే చోట పూర్తి చేయగల సింగిల్ విండో ఇంటర్ పేస్ బిల్డ్ నౌ. ప్రజలు తమ భవనాలను నిర్మాణానికి ముందే అగ్మెంటెడ్ రియాలిటీ 3డీ విజువలైజేషన్ ద్వారా చూడొచ్చు.
ఇది కూడా చదవండి: HYDRA: హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల!
భవన నిబంధనలపై తక్షణం, కచ్చితమైన మార్గదర్శకాలను ఈ AI ఆధారిత పవర్డ్ అసిస్టెంట్ అందిస్తుంది. ప్రతి దరఖాస్తును దృవీకరించి ట్రాక్ చేసేందుకు నమ్మకాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ అవాకశం కల్పిస్తుంది. డేటా ఆధారిత పాలనను చిత్తశుద్ధితో అమలు చేస్తుంది.
ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా మీడియాలో బుమ్రా నామస్మరణ.. ఆటగాళ్లు సైతం ఫిదా!
గతంలో ఎప్పుడు లేని విధంగా.. పట్టణాభివృద్ధి రంగం అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో వ్యాపార రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణలో దాదాపు 60 శాతం మంది జనాభా పట్టణ నగర ప్రాంతాల్లో ఉంటున్నందున ఈ శాఖపై స్పెషల్ ఫోకస్ ఉందని.. అందుకే స్వయంగా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తున్నారని ఆయన అన్నారు. స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ నగరం ఫస్ట్ ప్లేస్ లో ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.