సమగ్ర కుటుంబ సర్వే.. రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం GHMC పరిధిలో చేపడుతున్న ఈ సర్వేను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీతో పాటు జోనల్ స్థాయిలో ఈ సర్వేను పకడ్బందీగా చేసేందుకు, క్షేత్రస్థాయిలో సిబ్బందితో సమన్వయం కోసం పర్యవేక్షణ అధికారులను నియమించింది. By B Aravind 09 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో చేపడుతున్న ఈ సర్వేను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీతో పాటు జోనల్ స్థాయిలో ఈ సర్వేను పకడ్బందీగా చేసేందుకు, క్షేత్రస్థాయిలో సిబ్బందితో సమన్వయం కోసం పర్యవేక్షణ అధికారులను నియమించింది. దీనికి సంబంధించి రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. Also Read: బయటకు వచ్చిన కేసీఆర్.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు! GHMC పరిధిలో పర్యవేక్షణ అధికారిగా హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అలాగే సికింద్రాబాద్, చార్మినర్ జోన్లకు హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్ శ్రీవత్సను నియమించారు. ఖైరతాబాద్, ఎల్బీనగర్ జోన్లకు పురపాలక శాఖ ఉప కార్యదర్శి ప్రియాంక, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లకు జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్‌ను నియమించారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి.. ఝార్ఖండ్ ఎన్నికల అధికారిగా అక్కడికి వెళ్లారు. ప్రస్తుతం అక్కడి నుంచే సర్వే పనులకు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సర్వే పర్యవేక్షణ బాధ్యతలను సర్పరాజ్‌కు అప్పగించారు. ఇక జోనల్ కమిషనర్లు పర్యవేక్షణ అధికారులను సమన్వయం చేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్దేశించిన గడువులోగా సర్వేను పూర్తి చేయాలని.. అలాగే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సర్పరాజ్ సహకారం అందించాలని ప్రభుత్వం సూచించింది. Also Read: '11 నెలలైంది ఏం చేశారు'.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ఫైర్ ఇదిలాఉండగా తొలిదశ సర్వేలో భాగంగా తొలి మూడు రోజుల పాటు ఇండ్లకు స్టిక్కరింగ్ పూర్తి చేశారు. శనివారం నుంచి రెండో దశ ప్రారంభమైంది. ఈరోజు నుంచి ప్రతీ ఇంటికి వెళ్లి వ్యక్తిగత, ఫ్యామిలి వివరాలు సేకరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి ఈ రెండో దశ సర్వే పనులు మొదలయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర సర్కార్.. మొత్తం 243 కులాలను ఫైనల్ చేసి క్యాస్ట్ కోడ్స్ జాబితాను సిద్ధం చేసింది. ఇందులో ఎస్సీ కేటగిరీలో 59 కులాలు, ఎస్టీ కేటగిరిలో 32, బీసీ కేటగిరిలో 134 కులాలు, 18 కులాలను ఓసీ కేటగిరిలో గుర్తించారు. #telangana #telugu-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి