Telangana congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికార కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొనుంది.

New Update
t congress

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికార కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొనుంది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు ఒక రకమైన ట్రైలర్‌గా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పలువురు ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.

భారీ బహిరంగ సభ

గత ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి ఓడిన అజహరుద్దీన్ తో పాటు మరికొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ క్రమంలో భారీ బహిరంగ సభ నిర్వహించి సమరభేరికి సిద్దమని చాటి చెప్పాలిని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నెల 30వ తేదీన  జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో సహా,  మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ తదితరులు హాజరుకానున్నారు.  వాస్తవానికి ఈ సభ ఇవ్వాళ ఉండాల్సింది. కానీ బిహార్ లో రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఇక రాహుల్ కు సంఘీభావంగా ఓట్ చోర్ గద్దీ ఛోడ్ అనే నినాదంతో  ఈ సభను నిర్వహిస్తామని పీసీసీ చెప్పినా త్వరలో  జరగబోయే ఉపఎన్నికే టార్గెట్ అని తెలుస్తోంది. 

ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాలేదు. కానీ, ప్రధాన పార్టీలన్నీ ముందస్తుగానే కార్యాచరణను ప్రారంభించాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ ఉప ఎన్నిక రాజకీయంగా కీలకంగా మారింది.

ఎన్నికల సంఘం ఏర్పాట్లు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ఎన్నికల నిర్వహణ కోసం తాజాగా నోడల్ అధికారులను నియమించింది. ఈసీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఆర్.వి కర్ణన్ నోడల్‌ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.   ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని నోడల్ అధికారిగా నియమించిది ఈసీ. అలాగే ఈవీఎం, వివిప్యాట్ నిర్వహణ కోసం కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌవన్ ను, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా సి.టి.ఓ శ్రీనివాస్ ను, ట్రైనింగ్ అధికారిగా ఎల్‌.బి.నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ను, మెటీరియల్ మేనేజ్మెంట్ బాధ్యతలు అడ్మిన్ అదనపు కమిషనర్ కె. వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

 ఎంసీసీ నోడల్అధికారిగా అదనపు ఎస్పీ (విజిలెన్స్)ఎం. సుదర్శన్, లా అండ్ ఆర్డర్, వల్నరబుల్ మ్యాపింగ్, డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ బాధ్యతలు డీఎస్పీ నరసింహా రెడ్డి, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ బాధ్యతలు అడిషనల్ కమిషనర్ (ఫినాన్స్) జీహెచ్ఎంసీ బి గీతా రాధికకు అప్పగించారు. ఎన్నికల పరిశీలకులుగా అసిస్టెంట్ వెటర్నరీ అధికారి విల్సన్, డమ్మీ బ్యాలెట్ పేపర్ నోడల్ అధికారిగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, మీడియా కమ్యూనికేషన్, ఎంసీఎంసీ అధికారిగా సీపీఆర్‌ఓ సెక్షన్ పీఆర్‌ఓ ఎం.దశరథ్ ను నియమించారు. సైబర్ సెక్యూరిటీ, ఐటి, కంప్యూటరైజేషన్ నోడల్ అధికారిగా ఐటి జాయింట్ కమిషనర్ సి.రాధా, హెల్ప్‌లైన్, కంప్లైంట్ రీడ్రెస్సల్ అధికారిగా ఐటి ఏఈ కార్తీక్ కిరణ్, వెబ్‌కాస్టింగ్ అధికారిగా ఐటి ఏఈ తిరుమల కుమార్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

Advertisment
తాజా కథనాలు