లిమిట్స్ లో ఉండు.. మంత్రి కొండాకు ఎమ్మెల్యే నాయిని మాస్ వార్నింగ్!-VIDEO

వరంగల్‌ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మరో సారి తారా స్థాయికి చేరింది. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ, వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి మధ్య విభేదాలు మరోసారి భయటపడ్డాయి. సురేఖ లిమిట్స్‌లో ఉండాలని నాయిని వార్నింగ్ ఇచ్చారు.

New Update
Konda Surekha Vs Nayini Rajender Reddy

వరంగల్‌ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మరో సారి తారా స్థాయికి చేరింది. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ, వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి మధ్య విభేదాలు మరోసారి భయటపడ్డాయి. సురేఖపై నాయిని మరోసారి విమర్శలు గుప్పించారు. లిమిట్స్‌లో ఉండాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. మంత్రిగా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలుపుకుంటూ వెళ్లాల్సింది పోయి.. చిచ్చు పెడితే ఎలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో సురేఖ పెత్తనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భద్రకాళి ఆలయంలో మీకు నచ్చినవారికి కమిటీ సభ్యుల పదవుల ఇవ్వడం సరికాదని ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కు నాయిని ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆరోపించారు. 

మళ్లీ భగ్గుమన్న విభేదాలు..

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం.. అనంతరం కొండా సురేఖ మంత్రి కావడం దగ్గర నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. సురేఖ ఒక వర్గం.. ఇతర ఎమ్మెల్యేలంతా మరో వర్గంగా మారిపోయారు. సురేఖ, ఆమె భర్త మురళి తమ నియోజకవర్గాల్లో పెత్తానం చేస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ కు సైతం వారు కంప్లైంట్ చేశారు. బహిరంగంగా కూడా విమర్శలు చేశారు. అయితే.. గత కొన్ని రోజుల నుంచి ఈ విభేదాలు కాస్త ముగిసినట్లు కనిపించాయి. కానీ నాయిని రాజేందర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి.  

సురేఖపై చర్యలు?

మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. గత మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ఆమె పదవి పోతుందన్న చర్చ కూడా జరిగింది. కానీ హైకమాండ్ ఆ పని చేయలేదు. గతంలో నాగచైతన్య, సమంత విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించాయని.. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉందన్న చర్చ కూడా సాగింది. అనంతరం ఎమ్మెల్యేలతో విభేదాలు కూడా పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. కానీ పార్టీ పెద్దలు మాత్రం సురేఖకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. కానీ ఈ సారి మళ్లీ విభేదాలు భయటపడడంతో కాంగ్రెస్ హైకమాండ్ సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది.

Advertisment
తాజా కథనాలు