/rtv/media/media_files/2025/10/05/telangana-congress-jubileehills-2025-10-05-15-38-34.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. రేసులో ఉన్న ముఖ్య నేతల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుడడంతో ఏం చేయాలో తెలియక అగ్ర నాయకత్వం తలలు పట్టుకుంటోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ బరిలో నిలిచారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఖరారైన నాటి నుంచి టికెట్ తనకే అంటూ ఆయన ప్రచారం ప్రారంభించారు. అయితే.. అనూహ్యంగా అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు ప్రకటన విడుదల చేసి రేసు నుంచి తప్పించింది కాంగ్రెస్. అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. దీంతో ఇతర ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలతో పాటు ప్రచారంలో కూడా జోరు పెంచారు. అయితే ఇప్పుడు అజారుద్దీన్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
అజారుద్దీన్ కు ఇస్తామన్న ఎమ్మెల్సీ వ్యవహారం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. గవర్నర్ కోటాలో రాజకీయ నేతలకు అవకాశం ఇవ్వకూడదన్న అంశంపైనే కోర్టు విచారణ సాగుతోంది. ఇప్పుడు అజారుద్దీన్ కు కూడా అవే చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలవడంతో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దీంతో గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ దక్కేందుకు ఛాన్స్ ఉండదని వారు చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని అజారుద్దీన్ పై ఒత్తిడి తెస్తున్నారు. నిన్న భారీ సంఖ్యలో మైనారిటీ నేతలు అజారుద్దీన్ ఇంటి వద్దకు చేరుకుని ఈ మేరకు నినాదాలు చేశారు. దీంతో మనస్సు మార్చుకున్న అజారుద్దీన్ మళ్లీ ఎమ్మెల్సే టికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో చోటు లేదు. దీంతో ఇక్కడి నుంచి గెలిస్తే హైదరాబాద్ తో పాటు మైనారిటీ కోటాలో తనకు మంత్రి పదవి ఖాయమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అజారుద్దీన్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ కొత్త చిక్కులు
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 5, 2025
జూబ్లీహిల్స్ టికెట్ సొంతం చేసుకోవడానికి అజారుద్దీన్ ప్రయత్నాలు షురూ
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం
దీంతో జూబ్లీహిల్స్ బరిలో నిలవాలని ఫిక్స్.. ఆల్రెడీ మైనార్టీ నేతలతో మీటింగ్స్
ఎట్టి… pic.twitter.com/djjzHoXgbO
మరో వైపు టికెట్ కోసం ముగ్గురు బలమైన బీసీ నేతలు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ తో పాటు బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ మేయర్ గా పని చేసి ఇప్పుడు హస్తం గూటికి చేరిన బొంతు రామ్మోహన్ తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. వీరితో పాటు కార్పొరేటర్ సీఎన్ రెడ్డి కూడా ఓ వైపు ప్రచారం, మరో వైపు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. అయితే.. ముగ్గురి పేర్లతో జూబ్లీహిల్స్ పై రిపోర్ట్ ఇవ్వాలని ఇన్ఛార్జ్ మంత్రులను సీఎం రేవంత్ ఇప్పటికే ఆదేశించారు. అయితే వారి రిపోర్ట్ లో నవీన్ యాదవ్ తో పాటు బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లు ఉన్నట్లు లీకులు వస్తున్నాయి.
అతి త్వరలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన..
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ సతీమణి సునీతను ప్రకటించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ కూడా సాధ్యమైనంత త్వరగా అభ్యర్థిని ఫైనల్ చేయాలని భావిస్తోంది. దీంతో ఒకటి లేదా రెండు రోజుల్లో అభ్యర్థిపై అధికార ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందన్న ప్రచారం గాంధీ భవన్ వర్గాల్లో సాగుతోంది. ఈ రోజు రాత్రి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై జూబ్లీహిల్స్ అభ్యర్థి ఖరారుపై చర్చించే ఛాన్స్ ఉంది. ముగ్గురు పేర్లతో ఫైనల్ లిస్ట్ ను వారు హైకమాండ్ కు అందించనున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక పేరు ఫైనల్ చేయనుంది అగ్రనాయకత్వం.