/rtv/media/media_files/2025/12/02/cm-revanth-reddy-1-2025-12-02-18-30-01.jpg)
తెలంగాణలో స్పోర్ట్స్ స్పిరిట్‌ను నలుమూలలా చాటి చెప్పడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. స్వయంగా ఫుట్‌బాల్ ఆటగాడైన రేవంత్.. తమ బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా సమయం చిక్కినప్పుడల్లా మైదానంలోకి అడుగుపెడుతూ, పరుగులు తీస్తూ, గోల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే, మే 12న హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి వెళ్లి సీఎం ఫుట్‌బాల్ ఆడారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆట మధ్యలో షూ పాడైపోయినప్పటికీ, ఆయన ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.. షూ లేకుండానే తన ఆటను కొనసాగించారు. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఫహీం ఖురేషి, హెచ్‌సీయూ విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
డిసెంబర్ 13న హైదరాబాద్‌కు
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తన ఇండియా టూర్‌లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా, హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు సన్నద్ధమవుతూ, సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ) ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో గంటపాటు ప్రాక్టీస్ చేశారు.
Telangana CM Revanth Reddy is practicing football as he gets ready for Messi’s visit to Hyderabad on December 13.
— Aditya (@Aditya35551989) December 1, 2025
The CM will wear jersey number 9
While Messi will be in his famous number 10.
Two legends
One Ball
G.O.A.T Tour to Hyderabad@INCTelangana@IYCTelanganapic.twitter.com/kZzlKENVgK
రోజంతా అధికారిక కార్యక్రమాలతో అలసిపోయినా, రాత్రిపూట ఫుట్‌బాల్ ఆటగాళ్లతో కలిసి సీఎం గ్రౌండ్‌లోకి దిగారు. యువతతో కలిసి ఆయన ఉత్సాహంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొని, సుమారు గంటపాటు ప్రాక్టీస్ చేయడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ రైజింగ్లో భాగంగా రాష్ట్రంలో క్రీడా రంగాన్ని కూడా బలోపేతం చేసేందుకు, ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మెస్సీతో మ్యాచ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు తిప్పుకోవడానికి, రాష్ట్రంలో క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని భావిస్తున్నారు.
Follow Us