BIG BREAKINIG: కేసీఆర్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ కీలక ప్రకటన!

కేసీఆర్ ఆరోగ్యం గురించి కొందరు ఫేక్ వార్తలు పుట్టిస్తురని బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని పార్టీ నేతలు తెలిపారు.

New Update
KCR Delhi Tour

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయనను హైదరాబాద్ తరలిస్తున్నట్లు ఈ రోజు ఉదయం నుంచి కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. కేసీఆర్ ఆరోగ్యం గురించి కొందరు ఫేక్ వార్తలు పుట్టిస్తురని ప్రకటించింది. ఈ తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని పార్టీ నేతలు తెలిపారు. నేడు ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డితో సమావేశమయ్యారన్నారు. మీడియా సంస్థలు వాస్తవాల ఆధారంగా మాత్రమే వార్తలు ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఫామ్ హౌస్ లోనే..

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. కాలు విరిగిన సమయంలో కొద్ది రోజుల పాటు నందినగర్ నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడే ముఖ్య నేతలతో సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక సార్లు ఆయన ఆరోగ్యంపై వార్తలు వచ్చాయి. ఇటీవల ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చేరి రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. దీంతో ఆయనకు ఏమైంది అన్న అంశంపై జోరుగా చర్చ సాగింది. బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ఆందోళన వ్యక్తం అయ్యింది.

అయితే.. అప్పటి నుంచి ఆయన బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన వీడియోలను పార్టీ ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. ఈ రోజు బీఆర్ఎస్ జూబ్లిహిల్స్ అభ్యర్థిని ఖరారు చేస్తూ కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో హరీష్ రావు, కేటీఆర్, సిబితా ఇంద్రారెడ్డి తదితరులతో ఆయన సమావేశమైన వీడియో సైతం బయటకు వచ్చింది. ఆ కొద్ది సేపటికే కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అయ్యింది.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ అయ్యింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ ప్రకటన విడుదల చేసింది. దీంతో కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారంటూ వస్తున్న వార్తలకు బ్రేక్ వేసింది బీఆర్ఎస్. ఇదిలా ఉంటే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడనున్నారు. ఈ ఫార్ములా రేసుతో పాటు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికపై ఆయన మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు