కవిత వద్దు.. హరీష్ ముద్దు.. కేసీఆర్ సంచలన నిర్ణయం!

హరీష్‌ రావు టార్గెట్ గా MLC కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో దుమారం లేపాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. కవిత హాట్ కామెంట్స్ చేసిన కాసేపటికే.. బీఆర్ఎస్‌ ట్విట్టర్‌లో హరీష్‌కు మద్దతుగా ట్వీట్ చేసింది.

New Update
Harish Kavitha KCR

హరీష్‌ రావు టార్గెట్ గా MLC కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో దుమారం లేపాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. కవిత హాట్ కామెంట్స్ చేసిన కాసేపటికే.. బీఆర్ఎస్‌ ట్విట్టర్‌లో హరీష్‌కు మద్దతుగా ట్వీట్ చేసింది. ఇది ఆరు అడుగుల బుల్లెట్‌ అంటూ బీఆర్ఎస్ పోస్టు పెట్టింది. ఆ పార్టీ అధిష్టానం సైతం కవిత వ్యాఖ్యల నేపథ్యంలో అలర్ట్ అయ్యింది. కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ అత్యవసరంగా సమావేశమయ్యారు. 

ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించిన కవిత కాళేశ్వరం అవినీతిలో హరీష్‌ పాత్ర లేదా? అని ప్రశ్నించారు. అందుకే హరీష్‌ను ఇరిగేషన్‌ మంత్రిగా తొలగించారన్నారు. హరీష్ వల్లనే కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటాయని సంచలన ఆరోపణలు చేశారు. హరీష్‌ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ ఉన్నారని సీరియస్ కామెంట్లు చేశారు. మా నాన్నపై CBI ఎంక్వైరీనా, కడుపు రగులుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పై విచారణ అంటే తెలంగాణ బంద్ ఎందుకు పిలుపివ్వలేదని బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు.

తనపై కుట్రలను సహించానని, కేసీఆర్‌పై ఆరోపణలను తట్టుకోలేనని వ్యాఖ్యానించారు. దమ్ముంటే హరీష్‌, సంతోష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పని చేసిన అధికారుల దగ్గర వందల కోట్లు దొరికాయని గుర్తు చేశారు. అధికారుల వెనుక ఎవరున్నారో తేల్చండని డిమాండ్ చేశారు. హరీష్‌ రావు, సంతోష్‌, మెగా కృష్ణారెడ్డి వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరని అన్నారు. 

ఇటీవల వరుసగా పార్టీపై వ్యాఖ్యలు చేస్తున్న కవిత.. నేడు ఏకంగా కీలక నేత హరీష్ రావుపైనే కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు ముఖ్య నేతలతో కేసీఆర్ ఫామ్ హౌజ్ లో సమావేశం అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి కవిత PROను తొలగించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌లోనూ బీఆర్ఎస్ నేతలు కవితను అన్‌ఫాలో చేస్తున్నారు. కవితపై చర్యలకు బీఆర్ఎస్ సిద్ధమైనట్లు సమాచారం. పార్టీ నుంచి కవితను తొలగించే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది. ఈ రోజు లేదా రేపు ఈ అంశంపై బీఆర్ఎస్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు