/rtv/media/media_files/2025/04/11/AYhS6sAyo2kEioY3XmDt.jpg)
BRS MLA Harish Rao
బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
హరీష్ రావు గారిని తండ్రి ని పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు
— Chandu Reddy (@PRChanduReddy) April 11, 2025
గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు గారిని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పరామర్శించారు.. pic.twitter.com/2nfUoGLHO1
బీఆర్ఎస్ నేతల పరామర్శ..
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి సత్యనాయణరావును పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తదితరులు ఉన్నారు.
(BRS Harish Rao | telugu-news | telugu breaking news )