తెలంగాణ బీజేపీలో గందరగోళం.. లగచర్ల ఘటనపై ఒక్కో నేతది ఒక్కో మాట!

లగచర్ల ఘటనపై కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అంటే.. పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఎంపీ ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీరిద్దరి వ్యాఖ్యలకు భిన్నంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కిషన్ రెడ్డి విమర్శించారు.

New Update

లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటన తెలంగాణ బీజేపీలోని భిన్న స్వరాలను మరోసారి బయటపెట్టింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీపై ఆ పార్టీ ముగ్గురు ముఖ్యనేతలు మూడు విధాలుగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. లగచర్ల ఘటనలో కేటీఆర్‌ను లోపలేయాలంటూ ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కలెక్టర్ మీద కేటీఆరే దాడి చేయించాడని సంచలన ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: Maoists Warning: లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకోం.. రేవంత్ కు మావోయిస్టుల సంచలన లేఖ!

రెచ్చిపోయిన ధర్మపురి అరవింద్ | Tolivelugu.com #Tolivelugu #dharmapuriarvind #mlaktr #Vikarabaddistrict #collectorincident #trendingnews #viralnews

Posted by Tolivelugu.com on Thursday, November 14, 2024

ఆ పార్టీ మరో కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ గరీబోళ్ల భూములను ప్రభుత్వం లాక్కొవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. కంపెనీ కోసం భూమి సేకరించడానికి ప్రభుత్వం బ్రోకరింగ్ చేస్తుందా? అంటూ ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: KTR: వాడి నియోజకవర్గంలో మాకేం పని.. రేవంత్ పై కేటీఆర్ సంచలన కామెంట్స్!

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనన్న కిషన్ రెడ్డి..

ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఇద్దరు నేతల కామెంట్లకు భిన్నంగా మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ విమర్శలు చేశారు.  తాము ఎవరితో కలవలేదని స్పష్టం చేశారు. గతంలోనూ హైడ్రా విషయంలో బీజేపీ టాప్ లీడర్లంతా ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడడం చర్చనీయాంశమైంది. 

#eetala-rajendar #dharmapuri-aravind #lagacharla
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe