Telangana BJP: కిషన్ రెడ్డిపై తిరుగుబాటు.. అసలేం జరుగుతోంది?

క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో నేతలు కట్టుతప్పుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమిపై ఎంపీ అర్వింద్ ఏకంగా నాయకత్వానికే ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యే కాటిపల్లి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి చర్చల్లో నిలిచారు.

New Update
BJP Leaders internal fight

బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ పనితీరుపై ఇటీవల ఎంపీ అర్వింద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. GHMCలో 48 కార్పోరేటర్ సీట్లు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక్క సీటే ఎందుకు గెలిచిందని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వేయడం లేదన్నారు. తద్వారా రాష్ట్ర నాయకత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనుకున్న పరిస్థితి నుంచి బీజేపీ 8 సీట్లకే ఎందుకు పరిమితమైందంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోవడానికి బాధ్యులు ఎవరు? అంటూ నాయకత్వానికి ప్రశ్నలు గుప్పించారు. అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కాదా అంటూ వ్యాఖ్యానించారు. అర్వింద్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలు అర్వింద్ ఎవరిని ఉద్దేశించి చేశారు? అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఏకంగా కిషన్ రెడ్డినే ఆయన టార్గెట్ చేశారా? అన్న గుసగులు బీజేపీ ఆఫీసులో వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: TG News: పచ్చని కాపురంలో చిచ్చు.. హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత

ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం..

ఇటీవల ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టడంతో పార్టీలో అలజడి మొదలైంది. పార్టీ కార్యాలయం, అసెంబ్లీ ఎల్పీ ఉండగా ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టడంపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా బీజేపీ నేతల తీరు ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు పార్టీ తెలంగాణ చీఫ్ ను మార్చింది బీజేపీ. బండి సంజయ్ ను మార్చాలని సీనియర్లు పట్టుబట్టడంతో అగ్రనాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీ అర్వింద్ తదితరులు పోటీ పడ్డారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం

కిషన్ రెడ్డిపై అసంతృప్తి..

అయితే.. కిషన్ రెడ్డికే మళ్లీ నాయకత్వం అప్పగించింది బీజేపీ. అయితే.. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీరియస్ గా పని చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. కనీసం ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవడంతో తప్పుడు సంకేతాలు వెళ్లాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఫలితంగానే దారుణ పరాజయం ఎదురైందన్న చర్చ ఉంది. అయితే.. ఎన్నికలు గడిచి దాదాపు 10 నెలలు అవుతున్నా.. కొత్త అధ్యక్షుడిని నియమించికపోవడంపై సైతం శ్రేణుల్లో నిరుత్సాహం ఉంది.

ఇది కూడా చదవండి: కిషన్ రెడ్డిపై బీజేపీ నేతల తిరుగుబాటు.. వైరల్ అవుతోన్న వీడియోలు!

కుదరని ఏకాభిప్రాయం..

ఏకాభిప్రాయం కుదరకనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యం అవుతోందన్న చర్చ సాగుతోంది. అయితే.. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పార్టీకి సమయం ఇవ్వడం సాధ్యం కావడం లేదని.. ఇది పార్టీకి ఇబ్బందిగా మారిందని నేతలు చెబుతున్నారు. పార్టీ నాయకత్వం మార్చే వరకు బీజేపీలో విభేదాలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమస్యను అగ్ర నాయకత్వం ఎలా పరిష్కరిస్తుందో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

ఇది కూడా చదవండి: TGPSC Group 1: సుప్రీం కోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు

Advertisment
Advertisment
తాజా కథనాలు