/rtv/media/media_files/2025/03/11/rlnGkI323QJAXFLGnIuN.webp)
Telangana Assembly
తెలంగాణ అసెంబ్లీ ఆదివారం మున్సిపల్ చట్టసవరణ బిల్లుకు అమోదం తెలిపింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. పంచాయతీ రాజ్ శాఖలో బీసీలక 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మున్సిపల్ చట్టసవరణ చేశారు. ఆ బిల్లుకు బీఆర్ఎస్‌కు కూడా మద్దతు తెలిపింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంలో ఈ బిల్లు కీలకంగా మారనుంది.
ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ ఈ బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ సిన్సియర్‌గా సపోర్ట్ చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నాలుగు సార్లు మాట మార్చారని ఆరోపించారు కేటీఆర్. పంచాయతీ రాజ్ బిల్లులో రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులు లేవని అన్నారు. బీసీ సబ్‌ప్లాన్ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.
కేసీఆర్ గారు బీసీ బిడ్డలకు ఎం చేసిండు అనే సన్నాసులు సమాధానం.#TelanganaAssemblypic.twitter.com/MxPj8Y1qJg
— Captain Fasak 2.0🎯 (@2Captainparody) August 31, 2025
తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ల పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగనున్నాయి.