TG SSC Result: నేడు తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పదవతరగతి ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హజరయ్యారు.ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా రవీంద్రభారతి వేదికగా ఫలితాలను ప్రకటించనున్నారు.

New Update
TG SSC Result

TG SSC Results

TG SSC Result : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పదవతరగతి ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హజరయ్యారు.ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా రవీంద్రభారతి వేదికగా ఫలితాలను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు.రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లలోనూ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇక ఏప్రిల్ 15వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తైంది. కానీ ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడికాకపోవడంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఈసారి పదో తరగతి విద్యార్ధులకు గ్రేడ్స్‌ ఇవ్వడానికి బదులు గతంలో మాదిరి విద్యార్ధులకు మార్కుల‌ను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధివిధాలను రూపొందించడంలో జాప్యం నెలకొనడం మూలంగా టెన్త్‌ ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఈ రోజు విడుదలయ్యే ఫలితాల్లో విద్యార్ధులకు వచ్చిన మార్కులతో పాటు స‌బ్జెక్టుల వారీగా గ్రేడ్స్ కూడా ప్రక‌టించ‌నున్నారు.ఈ లెక్కన 91-100 మార్కులకు ఏ1, 81-90 మార్కులకు ఏ2, 71-80 బి1, 61-70 బి2, 51-60 సి1, 41-50 సి2, 35-40 డి గ్రేడులుగా నిర్ణయిస్తారు.

Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!

ఈఏడాది రాత పరీక్షలు 80 మార్కులకు, ఇంటర్నల్‌ మార్కులు 20 మార్కులను నిర్వహించారు. ఈ మేరకు మార్కుల మెమోలను జారీ చేస్తారు. అలాగే వచ్చే ఏడాది నుంచి టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులను కూడా తొలగించి, మొత్తం 6 సబ్జెక్టులకు 100 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు.రాత పరీక్షకు సంబంధించి హిందీలో 16 (పాస్‌ మార్కులు 20), మిగిలిన సబ్జెక్టుల్లో 28 వస్తే (పాస్‌ మార్కులు 35) పాసైనట్లు పరిగణిస్తారు

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

Advertisment
తాజా కథనాలు