HYDRA: అయ్యా.. మాకు న్యాయం చేయండి.. రంగనాథ్ కు ఆ బాధితుల వినతులు! అమీన్‌పురా బాధితులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలిసి తమ గోడు వినిపించుకున్నారు. మాధవరెడ్డి, చంద్రశేఖర్, కోటీశ్వరరావు అనే వ్యక్తులు ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా అమ్మి తమను మోసం చేశారని, తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. By srinivas 01 Nov 2024 in హైదరాబాద్ Latest News In Telugu New Update షేర్ చేయండి HYDRA: అమీన్‌పురా బాధితులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను శుక్రవారం కలిసి తమ గోడు వినిపించుకున్నారు. మాధవరెడ్డి, చంద్రశేఖర్, కోటీశ్వరరావు అనే వ్యక్తుల దగ్గర ప్లాట్లు కొని మోసపోయామంటూ ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 6 అనుమతులు చూపించి సర్వే నంబరు 12కు చెందిన ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా అమ్మారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేసి అమ్మిన వ్యక్తి నుంచి నష్టపరిహారం ఇప్పించాలంటూ హైడ్రా కమిషనర్‌కు వేడుకున్నారు. రద్దయిన అనుమతుల విషయాన్ని బయటకు చెప్పకుండా తమను మోసంచేసి ప్లాట్లు అమ్మేసారంటూ బాధితుల ఆవేదన చెందారు. ఇళ్ల స్థలాల్లోకి చెరువు నీరు వచ్చేలా.. దీంతో పూర్తి సర్వేచేయించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఏవీ రంగనాథ్ చెప్పారు. అమీన్‌పురా మండలంలోని పెద్ద చెరువు అలుగులు మూసేసి.. ఎగువ వైపు తమ స్థలాల్లోకి చెరువు నీరు వచ్చేలాచేశారంటూ మరి కొంతమంది హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పెద్దచెరువు నీరు కింద ఉన్న బండికుంట చెరువుకు వెళ్లేలా కాకుండా.. అటువైపు అలుగులు మూసేయడంతో ఎగువవైపు నీరు పారుతుండడంతో తమ ఇళ్ల స్థలాలు కోల్పోయామంటూ ఫిర్యాదులు చేశారు. సర్వే చేయించి బాధితులకు న్యాయం.. ఈ మేరకు సర్వేనంబరు 153లోని హుడా అనుమతి పొందిన లే ఔట్లో ఉన్న పార్కు స్థలాన్ని పక్కనే కొత్తగా వెంచర్ వేస్తున్న వారు కబ్జా చేశారంటూ అమీన్‌పురా మండలంలోని వెంకటరమణా కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. సర్వే చేయించి తమ పార్కుతో పాటు.. లే ఔట్‌లోని రహదారులను కాపాడాలంటూ విన్నవించారు. భవర్‌లాల్‌జైన్ తమకు 1987లో విక్రయించగా.. ఆయన కుమారుడు మహావీర్ జైన్ సర్వే నంబరు 153లోని తమ లేఔట్‌లోని పార్కు స్థలాన్ని అమ్మేశారంటూ కంప్లైంట్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో సర్వే చేయించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని రంగనాథ్ హామీ ఇచ్చారు. #hydra #av-ranganath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి