/rtv/media/media_files/2025/07/15/surveyor-tejeshwar-case-2025-07-15-20-06-55.jpg)
Surveyor Tejeshwar Case
గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసుకు సంబంధించి రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఏ1 తిరుమలరావు, ఏ2 ఐశ్వర్యలకు కోర్టు తాజాగా రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు మూడు రోజులు కస్టడీలోకి తీసుకొని.. విచారించగా సంచలన విషయాలు బయటపెట్టారు.
ఇది కూడా చూడండి: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
తేజేశ్వర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరుమలరావు.. తన ప్రియురాలు ఐశ్వర్యపై తీవ్ర అనుమానంతో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే ఐశ్వర్య కదలికలపై నిఘా పెట్టేందుకు తిరుమలరావు ఆమె స్కూటీకి రహస్యంగా ట్రాకర్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చూడండి: పెళ్లికి ముందు HIV టెస్టు తప్పనిసరి.. మంత్రి సంచలన ప్రకటన
దీంతో ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎవరెవరిని కలుస్తుంది అనే విషయాలను తెలుసుకునేవాడని.. ఈ ట్రాకర్ ద్వారానే ఐశ్వర్య.. తేజేశ్వర్‌ను కలుస్తోందని నిర్ధారించుకున్న తిరుమలరావు.. ఆ తర్వాత తేజేశ్వర్‌ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కొత్త అంశాలు కేసు దర్యాప్తులో కీలక మలుపు తిప్పుతున్నాయి.
ఇది కూడా చూడండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!