![Mannam Rayudu (1)](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/15/5Xph4grn8JMm40JLLWwv.jpg)
సాహిత్య రంగానికి విశేష సేవలు అందిస్తున్న మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ మన్నం వెంకట రాయుడికి సాహితీ సేవారత్న పురస్కారం లభించింది. శాంతా- వసంతా ట్రస్టు ఆయనను ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనుంది. ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజకు డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని ప్రకటించారు.
Also Read: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
ఈ మేరకు శాంతా- వసంతా ట్రస్టు శనివారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీంతో వీరికి భారీ నగదు బహుమతితో పాటు, జ్ఞాపికలతో సత్కరించనున్నారు. ఈ నెల అంటే డిసెంబర్ 21న తెలంగాణ సారస్వత పరిషత్తులో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు, శాలువా, జ్ఞాపికతో పాటు ప్రశంసాపత్రంతో వీరిని సత్కరించనున్నట్లు ట్రస్టు వెల్లడించింది.
ముఖ్య అతిథులుగా
ఇది కూడా చూడండి: 8 మంది ఉన్నా.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఉగ్రరూపం!
ఈ శాంతా వసంతా ట్రస్టు పురస్కారాల వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డా.కె.వి. రమణాచారి ఐ.ఎ.ఎస్ (రిటైర్డ్) హాజరుకానున్నారు. అలాగే సభాధ్యక్షులుగా తెలంగాణ సారస్వతపరిషత్తు అధ్యక్షులు డా. ఎల్లూరి శివారెడ్డి వ్యవహరించనున్నారు. సభను తెలంగాణ సారస్వతపరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జె. చెన్నయ్య నిర్వహించనున్నారు.
వేదిక
Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు
ఈ కార్యక్రమం 2024 డిసెంబర్ 21న శనివారం సాయంత్రం 5.56 గంటలకు ప్రారంభం కానుంది. డా. దేవులపల్లి రామానుజరావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్, తిలక్ రోడ్, ఆబిడ్స్, హైదరాబాద్‌లో జరగనుంది.