HCU students | హెచ్‌సీయూను ముట్టడించిన విద్యార్థులు.. పరిస్థితి ఉద్రిక్తం

కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు.

New Update
 University of Hyderabad

University of Hyderabad

HCU students :  కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం, ఏబీవీపీ, వామపక్షాల నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. దాంతో రేవంత్‌ సర్కారుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Former Union Minster Girija Vyas:దేవుడి హారతి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలైన మాజీ కేంద్ర మంత్రి

హెచ్ సీయూ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓవైపు బీజేపీ, సీపీఎం నాయకుల అందోళనలు కొనసాగుతున్న సమయంలోనే విద్యార్థులు మెయిన్ గేట్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేట్ నుంచి బయటకు వచ్చేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని గేట్ లోపలికి పంపించారు. విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ సీయూ వద్దకు చీకోటి ప్రవీణ్..


విద్యార్థులకు మద్దతుగా బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ ఒక్కడే తన కారులో హెచ్ సీయూ వద్దకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గకుండా హెచ్ సీయూ గేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అయితే పోలీసులు అతనిని అడ్డుకున్నారు. అటు బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లు హెచ్ సీయూ వద్దకు రాగా పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. 

Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ హెచ్ సీయూ వద్ద గత కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఆందోళనలు ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగాయి. విద్యార్థుల అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆయా రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. దీంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


కేటీఆర్‌, హరీష్‌రావు ఇండ్ల వద్ద పోలీసులు


కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల   నివాసాల వద్ద పోలీసులు  మోహరించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, రాష్ట్ర మాజీ మంత్రి హరీష్‌ రావు  నివాసాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. విద్యార్థులకు మద్దతుగా వారు హెచ్‌సీయూకు వెళ్లనున్నారనే సమచారంతో పోలీసులు వారి ఇంటివద్ద పోలీసులు మోహరించారు.  


 హైకోర్టులో పిల్‌..


కాగా కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలంటూ వట ఫౌండేషన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. అత్యవసర విచారణకు స్వీకరించాలని ఫౌండేషన్‌ తరఫు న్యాయవాది కోరారు. దీనిపై బుధవారం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

Also Read:  TG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!

Also Read: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!

Advertisment
తాజా కథనాలు