Telangana Police  :  తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం. ఒకేసారి  77మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. మొత్తం 77 మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు. ఒకేసారి 77మంది డీఎస్పీలను బదిలీ చేయడం సంచలనంగా మారింది.

New Update
TELANGANA POLICE

TELANGANA POLICE

Telangana Police :

జగిత్యాల డీఎస్పీగా వెంకటస్వామి, బాలానగర్‌ ఏసీపీగా నరేశ్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్, మాదాపూర్ ఏసీపీ‌గా సీహెచ్‌ శ్రీధర్, చిక్కడపల్లి ఏసీపీగా శ్రీకాంత్, మేడ్చల్ ఏసీపీగా శంకర్ రెడ్డి, సంతోష్ నగర్ ఏసీపీగా సుఖ్‌దేవ్‌సింగ్, హుజూరాబాద్ డీఎస్పీగా మాధవి, కామారెడ్డి డీఎస్పీగా శ్రీనివాసరావు, పటాన్ చెరు ఏసీపీగా ప్రభాకర్, సిద్దిపేట ఏసీపీగా రవీందర్ రెడ్డి, కూకట్‌పల్లి ఏసీపీగా రవికిరణ్ రెడ్డి, పేట్‌బషీర్‌బాద్ ఏసీపీగా బాలగంగిరెడ్డి, మహేశ్వరం ఏసీపీగా జానకిరెడ్డి, షాద్‌నగర్‌ ఏసీపీగా లక్ష్మినారాయణ సహా మొత్తం 77 మందిని డీజీపీ బదిలీ చేశారు.  బదిలీ అయిన డీఎస్పీల వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు