TS News: రాష్ట్రంలో కొనసాగుతోన్న ఐపీఎస్ ల బదిలీలు..తాజాగా మరో ముగ్గురు బదిలీ.!
తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ముగ్గురు ఐపీఎస్ అఫీసర్లు బదిలీ అయ్యారు. మల్టీజోన్ 1 ఐజీగా రంగనాథ్, టీఎస్ న్యాబ్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, ఆర్గనైజేషన్స్ ఐజీగా విశ్వప్రసాద్ ను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.