Secunderabad to Goa Train: గోవా వెళ్లాలనుకుంటున్నారా ?. అయితే మీకో గుడ్‌న్యూస్. సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 9 నుంచి సికింద్రాబాద్ నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అలాగే అక్టోబర్10 నుంచి గోవాలోని వాస్కోడగామా స్టేషన్ నుంచి ప్రారంభమవుతాయి. వాస్కోడగామా-సికింద్రాబాద్ (17040) రైలు ప్రతీ గురు, శనివారాల్లో బయలుదేరుతాయి.
Also Read: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు
అయితే ప్రస్తుతం సికింద్రాబాద్-వాస్కోడగామా మధ్య రెగ్యులర్ సర్వీసు(17603) ఉంది. ఇది మంగళ, బుధ, ఆదివారాల్లో నడుస్తోంది. ప్రయాణికుల నుంచి తీవ్ర డిమాండ్ ఉండటం వల్ల ఈ రైలు.. ఎప్పుడూ ప్రయణికులతో కిటకిటలాడుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి వాస్కోడగామాకు మరో రైలు కూడా ఉంది. కానీ ఇది వారంలో ఒకరోజు మాత్రమే నడుస్తుంది. ఈ రైలులో టికెట్లు దొరకడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలోనే కొత్త రైలు రావడంతో పర్యాటకుల ప్రయాణ అవకాశాలు మరింత పెరగనున్నాయి. ఈ కొత్త రైలు సికింద్రాబాద్ నుంచి న్ కాచిగూడ ,షాద్నగర్, జడ్చర్ల మహబూబ్నగర్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్ళారీ, హోస్పేట, కొప్పల్, గదడ్, హుబ్బలి, దర్వాడ్, లోండా, మడగాన్ మీదుగా మొత్తం 20 స్టేషన్లలో ఆగుతూ గోవాకు చేరుకుంటుంది.