తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు..

తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు కావడంతో మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలతో ఆడుతున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మ భక్తి శ్రద్ధలతో పేర్చి.. గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్నారు.

New Update
Bathukamma 2

తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు కావడంతో మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలతో ఆడుతున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మ భక్తి శ్రద్ధలతో పేర్చి.. గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. వందలాది మంది మహిళలు బతుకమ్మ పాటలతో సంబురాలు చేసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ఆటంకం ఏర్పడింది.      

Also Read: భార్య రెండో పెళ్లి చేసుకుందని.. మొదటి భర్త ఏం చేశాడంటే ?

 ఇక హనుమకొండ పద్మాక్షి అమ్మవారి గుండం వేలిది మంది మహిళలతో కిక్కరిసిపోయింది. కరీనంగర్, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. మొదటిరోజు ఎంగిలపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకలు గురువారంతో ముగియనున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు